![Rudrankota movie release in August - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/27/rudravanam.jpg.webp?itok=SvC92kub)
సీనియర్ నటి జయలలిత సమర్పించి, ఓ కీలక పాత్ర చేసిన చిత్రం ‘రుద్రంకోట’. రాము కోన దర్శకత్వంలో అనిల్ ఆర్కా కండవల్లి నిర్మించిన ఈ చిత్రంలో అనిల్ ఆర్కా, విభీష, రియా హీరో హీరోయిన్లు. ఈ చిత్రం ఆగస్ట్‌లో స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరో, నిర్మాత అనిల్ ఆర్క కండవల్లి మాట్లాడుతూ.. ‘శ్మశాన వాటికలో పెరిగిన ఓ యువకుడి ప్రేమకథా చిత్రమిది. భద్రాచలం దగ్గర రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇప్పటి వరకు ఎవరూ చూపించని అంశాలను మా చిత్రంలో చూపిస్తున్నాం. ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలుంటాయి. సీనియర్ నటి జయలలిత గారు సమర్పకులుగా వ్యవహరిస్తూ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు.
ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారు మా చిత్రానికి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ ప్రముఖులు యుబైఏ సర్టిఫికెట్ తో పాటు సినిమా బావుందంటూ ప్రశంసించారు. మా సినిమా నచ్చడంతో స్క్రీన్ మాక్స్ వారు గ్రాండ్ గా విడుదల చేయడానికి ముందుకొచ్చారు. ఆగస్ట్ లో సినిమాను విడుదల చేయనున్నాం’అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment