
న్యూఢిల్లీ: పెరిగిన ముడివస్తువుల ధరల భారాన్ని వినియోగదారులకు బదిలీచేసే యోచనలో ఉన్నట్లు యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది. పలు ప్యాసింజర్ వాహనాల ధరలను రూ.30,000 వరకూ (2 శాతం) పెంచే అవకాశం ఉందని ఎం అండ్ ఎం ఆటోమోటివ్ సెక్టార్ ప్రెసిడెంట్ రాజన్ వధెరా అన్నారు.
పెరిగిన ధరలు ఆగస్టు నుంచి అమలయ్యే అవకాశం ఉందని తెలిపారు. టాటా మోటార్స్ సైతం ఆగస్టు నుంచి 2.2 శాతం మేర ధరలు పెరిగేందుకు అవకాశం ఉందని వెల్లడించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment