ఎండీయూ వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి బియ్యం అందిస్తున్న దృశ్యం(ఫైల్)
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో నిరుపేదలకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన (పీఎంజీకేవై) కింద ఆగస్టు ఒకటో తేదీ నుంచి రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యాన్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) 3,06,878 మంది కార్డు దారులకు రేషన్ దుకాణాల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు బియ్యాన్ని అందించనున్నారు.
ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రేషన్ షాపులలో ఈ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. కార్డులోని ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున నాన్ సార్టెక్స్ బియ్యం ఇస్తారు. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబి్ధదారులకు వలంటీర్ల ద్వారా పంపిణీకి సంబంధించిన కూపన్లు రెండు రోజుల ముందే వారి ఇంటి వద్దనే అందజేసే విధంగా ఏర్పాటు చేశారు. కూపన్లు తీసుకొన్న లబి్ధదారులు వారు కూపన్లలో చూపిన దుకాణానికి వెళ్లి ఉచిత బియ్యం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
యథావిధిగా రాష్ట్రం బియ్యం..
ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపిణీ చేస్తున్న సార్టెక్స్ బియ్యాన్ని యథావిధిగా ఉమ్మడి జిల్లాలోని కార్డుదారులకు 710 ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈ పంపిణీ ఆగస్టు 1వ తేదీ నుంచి ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాగనుంది. కార్డుదారుని ఇంటి వద్దకే వెళ్లి ఈ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు.
గ్యాస్ సిలెండర్ల విక్రయాలకు..
ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ షాపుల్లో 5కేజీల గ్యాస్ సిలెండర్లను అందుబాటులోకి ఉంచే దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జాయింట్ కల్టెకర్ నుపూర్ అజయ్ కుమార్ గ్యాస్ కంపెనీలు, రేషన్‌షాపు డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కలి్పంచారు. ఈ మేరకు వారితో ఎంఓయూ చేసుకున్నారు. ఒక్కో రేషన్ షాపులో 20 సిలెండర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటారు. 5 కేజీల గ్యాస్ సిలెండర్ రిజి్రస్టేషన్ చార్జీ రూ. 1,803గా నిర్ణయించారు. ఇందులో రూ.640విలువైన గ్యాస్ ఉంటుంది. గ్యాస్ అయి పోయిన వెంటనే, రేషన్‌షాపు వద్దకు వెళ్లి ఖాళీ సిలెండర్, ఇచ్చి నిండు సిలెండర్ తీసుకోవచ్చు.
బియ్యం పంపిణీకి ఏర్పాట్లు..
జిల్లాలో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద గుర్తించిన కార్డులకు, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నాం. రేషన్ షాపుల ద్వారా ఈ బియ్యాన్ని పంపిణీ చేసే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతినెలా చేస్తున్న బియ్యం పంపిణీ యథావిధిగా కొనసాగుతుంది. కార్డుదారులకు ఎండీయూ వాహనాల ద్వారా ఇంటికే వెళ్లి అందిస్తాం. త్వరలో రేషన్ షాపుల్లో 5కేజీల సిలెండర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకొంటున్నాం.
– శ్రీవాస్ నుపూర్, జేసీ, ఎన్టీఆర్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment