
వచ్చే ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు 14 రోజులు మూత పడనున్నాయి. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా పండుగలు, పర్వదినాలు, వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక దినోత్సవాలతోపాటు రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలను కలుపుకొంటే 14 రోజులు సెలవులు ఉన్నాయి.
ఆగస్టు నెలలో వివిధ బ్యాంకు పనులకు ప్రణాళిక వేసుకున్న ఖాతాదారులు సెలవుల జాబితాకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరముంది. బ్యాంకులు మూసేసినా ఇంటెర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు నిరంతరం అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే ప్రత్యేకించి బ్యాంకు బ్రాంచిలలోనే పూర్తి చేసుకోవాల్సిన కొన్ని పనులకు అవాంతరాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్‌కు గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. కాబట్టి డిపాజిట్‌దారులు గమనించాల్సిన అవసరం ఉంది.
సెలవుల జాబితా ఇదే..
- ఆగస్టు 6- ఆదివారం
- ఆగస్టు 8- టెండాంగ్ లో రమ్ ఫాట్ ( సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో సెలవు)
- ఆగస్టు 12- రెండో శనివారం
- ఆగస్టు 13- ఆదివారం
- ఆగస్టు 15- స్వాతంత్ర్య దినోత్సవం
- ఆగస్టు 16- పార్సీ నూతన సంవత్సరం (ముంబై, నాగ్‌పూర్, బేలాపూర్‌లలో సెలవు)
- ఆగస్టు 18- శ్రీమంత శంకర్‌దేవ్ తిథి ( అస్సాం గౌహతిలో సెలవు)
- ఆగస్టు 20- ఆదివారం
- ఆగస్టు 26– నాలుగో శనివారం
- ఆగస్టు 27- ఆదివారం
- ఆగస్టు 28 - మొదటి ఓనం (కొచ్చి, తిరువనంతపురంలో సెలవు)
- ఆగస్టు 29 - తిరుఓణం (కొచ్చి, తిరువనంతపురంలో హాలిడే)
- ఆగస్టు 30- రక్షా బంధన్
- ఆగస్ట్ 31- రక్షా బంధన్/శ్రీ నారాయణ గురు జయంతి/పాంగ్-లాబ్సోల్ (డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, కాన్పూర్, కొచ్చి, లక్నో, తిరువనంతపురంలలో సెలవు)
Comments
Please login to add a commentAdd a comment