న్యూఢిల్లీ: డీజిల్ అమ్మకాల్లో క్షీణత కొనసాగుతూనే ఉంది. సెపె్టంబర్ నెలలోనూ 3% తక్కువగా విక్రయాలు నమోదయ్యాయి. ఆగస్ట్‌లోనూ డీజిల్ అమ్మకాలు 3.2% తగ్గడం గమనించొచ్చు. ఏటా జూన్ నుంచి మొదలయ్యే నాలుగు నెలల వర్షాకాల సీజన్‌లో డీజిల్ అమ్మకాలు తక్కువగా నమోదవుతుంటాయి. ఇక పెట్రోల్ విక్రయాలు 5.4% పెరిగాయి. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కె టింగ్ కంపెనీలు హెచ్‌పీసీఎల్, ఐవోసీఎల్, బీపీసీఎల్ ఉమ్మడి గణాంకాలు ప్రతి నెలా విడుదల అవుతుంటాయి.
వీటి ప్రకారం సెపె్టంబర్‌లో డీజిల్ అమ్మకాలు 5.81 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో 5.99 మిలియన్ టన్నుల మేర అమ్మకాలు ఉండడం గమనార్హం. ముఖ్యంగా సెపె్టంబర్ నెలలో మొదటి 15 రోజుల్లో డీజిల్ అమ్మకాలు 5 శాతం తగ్గగా, తర్వాతి 15 రోజుల్లో వర్షాలు లేకపోవడంతో పుంజుకున్నాయి. ఇక ఆగస్ట్ నెల విక్రయాలతో పోల్చి చూస్తే డీజిల్ అమ్మకాలు 2.5 శాతం పెరిగాయి.
ఆగస్ట్ నెలలో డీజిల్ విక్రయాలు 5.67 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో 6.7 శాతం, మే నెలలో 9.3 శాతం చొప్పున డీజిల్ అమ్మకాలు పెరిగాయి. జూన్ నుంచి తగ్గుతూ వస్తున్నాయి. పెట్రోల్ విక్రయాలు సెప్టెంబర్ నెలలో 2.8 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చనప్పుడు 5.4 శాతం వృద్ధి కనిపించింది. ఆగస్ట్ నెలలో మాత్రం పెట్రోల్ విక్రయాలు ఫ్లాట్‌గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment