యాంటీబయోటిక్స్‌తో మతిభ్రమణం!
పరిపరి శోధన
చిన్నా చితకా ఇబ్బందులకు ఎడా పెడా యాంటీబయోటిక్స్ వాడటం చాలామందికి అలవాటే. అయితే, మోతాదు చూసుకోకుండా ఇష్టానుసారం యాంటీబయోటిక్స్ వాడితే ఇబ్బందులు తప్పవని అంతర్జాతీయ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోతాదుకు మించిన యాంటీబయోటిక్స్ వాడటం వల్ల శారీరక సమస్యలు మాత్రమే కాదు, కొందరిలో తాత్కాలిక మతిభ్రమణం వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్త డాక్టర్ శామిక్ భట్టాచార్య చెబుతున్నారు.
దీర్ఘకాలంగా మోతాదుకు మించి యాంటీబయోటిక్స్ వాడేవారిలో రకరకాల భ్రమలు కలగడం, సంధి ప్రేలాపనలు వంటి లక్షణాలు కనిపిస్తాయని తమ పరిశోధనల్లో గుర్తించినట్లు ఆయన తెలిపారు.