
టాప్ హీరోయిన్ కీలక నిర్ణయం
చెన్నై: ఇకపై తనకు తానే మేనేజర్ అంటోంది కాజల్ అగర్వాల్. దక్షిణాదిలో క్రేజీ కథానాయికిగా రాణిస్తున్న నటీమణుల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ముఖ్యంగా తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోయిన్‌గా వెలిగిపోతున్న ఈ బ్యూటీ తన కాల్‌షీట్స్, పారితోషికం వ్యవహారాలను సరిదిద్దడానికి ఒక మేనేజర్‌ను నియమించుకున్న విషయం తెలిసిందే. రోనీ అనే అతడు కాజల్‌తో పాటు మరి కొందరు హీరోయిన్లకు కాల్‌షీట్స్ వ్యవహారాలను చూసుకుంటున్నారు. టాలీవుడ్‌ను డ్రగ్స్ వ్యవహారం నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ పోలీసులు రోనీ నివాసంలో జరిపిన సోదాల్లో మత్తుపదార్థాలు లభ్యమయ్యాయి. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దీనిపై స్పందించిన కాజల్ అతను తనకు మేనేజర్ మాత్రమేననీ, రోనీ వ్యక్తిగత విషయాల గురించి తనకు తెలియదని చెప్పారు. అలాంటి చట్ట విరోధక కార్యాలను తాను ఎప్పటికీ పోత్సహించనని అంటున్నా కాజల్ ఇకపై తానెవరినీ మేనేజర్‌గా నియమించుకోనని స్పష్టం చేశారు. ఇక సహాయకుడిని మాత్రం నియమించుకుని తనకు తానే మేనేజర్‌గా మారనున్నట్లు చెప్పారు. ఇకపై కథలు, పారితోషికం వంటి విషయాలను తానే చూసుకుంటానని కాజల్ స్పష్టం చేశారు.