బెంగళూరు: రేణుకాస్వామి అనే యువకుడి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం(జూన్ 18) హీరో దర్శన్ ఫాంహౌజ్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
బెంగళూరులోని దర్శన్ ఫామ్‌హౌస్‌లోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. శ్రీధర్ చనిపోతూ ఒక సూసైడ్‌నోట్ రాయడంతో పాటు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు లేఖ, వీడియోలో శ్రీధర్ తెలిపారు.
తన చావుకు తానే బాధ్యుడినని వేరే ఎవరూ కారణం కాదని స్పష్టం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, తన ప్రియురాలు నటి పవిత్ర గౌడకు అశ్లీల సందేశాలు పంపుతూ దూషిస్తూ మెసేజ్‌లు పెట్టినందుకే రేణుకాస్వామిని దర్శన్ హత్య చేయించాడని ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment