నేరం అంగీకరించిన హీరో దర్శన్ ! Darshan allegedly confessed to giving Rs 30 lakh to another suspect. Sakshi
Sakshi News home page

నేరం అంగీకరించిన కన్నడ హీరో దర్శన్ !

Published Wed, Jun 19 2024 9:51 PM | Last Updated on Thu, Jun 20 2024 8:44 AM

Darshan Confessed Before Police

బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌ తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేయించిన కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకొంది.  హత్య తర్వాత అభిమాని మృతదేహాన్ని ఎవరి కంట పడకుండా మాయం చేసేందుకు దర్శన్‌ మరో నిందితుడికి రూ. 30 లక్షలు ఇచ్చినట్లు తేలింది. 

ఈ నేరాన్ని దర్శన్‌  అంగీకరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. హత్య కేసులో ఇప్పటికే దర్శన్‌ను అరెస్టు చేసిన పోలీసులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. 

రేణుకాస్వామి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా మాయం చేయాలని మరో నిందితుడైన ప్రదేశ్‌కు రూ.30లక్షలు ఇచ్చినట్లు దర్శన్‌ అంగీకరించాడు.  దర్శన్‌ పోలీసుల ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement