ఫైనాన్స్‌ పేరిట కుచ్చుటోపి ! | Sakshi
Sakshi News home page

ఫైనాన్స్‌ పేరిట కుచ్చుటోపి !

Published Fri, Oct 7 2016 11:37 PM

Finance

  •  రూ. 20 లక్షలకు ఎసరు
  • బీర్కూర్‌ :
    చిట్టీలు, ఫైనాన్సు పేరిట మోసాలు జరుగుతున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. కొంతమంది వ్యాపారులు, ఉద్యోగులు తమ డబ్బు వీలైనంత త్వరగా రెట్టింపు కావాలనే ఆశతో ప్రయివేటు ఫైనాన్సుల్లో భాగస్వాములుగా ఉంటూ మోసపోతున్నారు. ఇలాంటి ఘటనే బీర్కూర్‌లో చోటుచేసుకుంది. బీర్కూర్‌లో 11 మంది స్నేహితులు కలిసి ఒక్కొక్కరు రూ. లక్ష చొప్పున 11 లక్షలతో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఫైనాన్స్‌ను ప్రారంభించారు. నిర్వాహణ బాధ్యతను కొన్నేళ్లు బాగానే చూసుకున్న ఓ భాగస్వామి డబ్బుపై దురాశతో లెక్కలు బుట్టదాఖలు చేశాడు. అసలు, లాభం కలుపుకుని సుమారు రూ. 20 లక్షలకు కుచ్చుటోపి పెట్టాడు. భాగస్వాముల వాటా చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతుండడంతో వారు శుక్రవారం బీర్కూర్‌ పోలీసులను ఆశ్రయించారు. దీంతో తన రెండెకరాల పొలం అమ్మి భాగస్వాములకు బాకీ చెల్లిస్తానని సదరు వ్యక్తి కులపెద్దలతో రాయబారం పంపించాడు. ఈవిషయమై ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డిని సంప్రదించగా సివిల్‌ కేసు పరిధిలోకి వస్తుందని, బాధితులు ఎలాంటి ఫిర్యాదు చే యలేదని పేర్కొన్నారు. బాధిత భాగస్వాముల్లో ఒకరిద్దరు పోలీసు కానిస్టేబుళ్లు కూడా ఉండడం కొసమెరుపు. 

Advertisement
 
Advertisement
 
Advertisement