ఖమ్మంఅర్బన్: శాస్త్ర, సాంకేతిక రంగంలో కీలకమైన చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతమైంది. అయితే, ఈ ప్రయోగంలో ఖమ్మంకు చెందిన శాస్త్రవేత్త ఆపరేషన్ మేనేజర్‌గా వ్యవహరించారు. ఖమ్మం శ్రీనగర్‌కాలనీకి చెందిన రిటైర్డ్ పీఆర్ డీఈ వల్లూరి కోటేశ్వరరావు కుమారుడు వల్లూరి ఉమామహేశ్వరరావు 2013లో ఇస్రో శాస్త్రవేత్తగా చేరారు.
వివిధ స్థాయిల్లో పదేళ్ల నుంచి ప్రయోగాల్లో పాలు పంచుకుంటున్న ఆయనకు చంద్రయాన్–3లో ఆపరేషన్ మేనేజర్‌గా అవకాశం దక్కింది. బెంగళూరు కేంద్రంగా ఇస్రోలో ఆపరేషన్ డిజైనింగ్ విభాగంలో 1,500 మందికి పైగా పనిచేస్తుండగా... ఆపరేషన్ మేనేజర్లుగా 30మందిని ఎంపిక చేశారు. ఇందులో ఉమామహేశ్వరరావు కూడా ఉండడం విశేషం. ఈసందర్భంగా ఆయన ఫోన్‌లో ‘సాక్షి’తో మాట్లాడుతూ దేశ సాంకేతిక రంగంలో కీలకమైన ప్రయోగంలో తాను పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment