ముగిసిన సీఎం కప్ క్రీడాపోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లాస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు శనివారం ముగిశాయి. గత వారం రోజులుగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు అన్ని క్రీడాంశాల్లో కలిపి 3,602 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఆయా అంశాల్లో 610 మంది విజయం సాధించి బహుమతులు అందుకున్నారు. కాగా, పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారు సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. చివరిరోజైన శనివారం బాలికల ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, ఖో–ఖో, బాక్సింగ్, పోటీలు జరిగాయి. బాలికల ఖో–ఖో పోటీల్లో ఎర్రుపాలెం, మధిర జట్లు, బాస్కెట్‌బాల్‌లో సర్థార్ పటేల్‌స్టేడియం, పీవీఆర్ క్లబ్ జట్లు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. అలాగే, యోగా బాలుర విభాగంలో లక్ష్మీప్రణీత్, రంజిత్‌కుమార్, బి.నవదీప్, బాలికల విభాగంలో బి.తమరాస, సీహెచ్.శ్రీవల్లి, బి.అక్షర వరుసగా మొదటి మూడు స్థానాలు సాధించారు. మెయిట్ లిఫ్టింగ్‌లో కె.అభి, పి.పూర్ణసాయిరాం, జి.శరణ్యయంద్ర, జి.నిఖిల్‌దీప్, అనూష్, సీహెచ్.రాకేష్, బి.పల్లవి, ఏ.తనుశ్రీ, యశస్విని, ఎస్.సాత్వి, నిక్షిత, నాగశ్రీ, బాక్సింగ్ బాలికల విభాగంలో టి.హర్షిత, సీహెచ్.సంజన, బాలురలో ఎం.వెంకటశ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచారు. ఈ మేరకు విజేతలకు డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, జిల్లా పాఠశాలల క్రీడా కార్యదర్శి కె.నర్సింహామూర్తి బహుమతులు అందజేయగా కోచ్‌లు ఎం.డీ.గౌస్, ఎం.డీ.అక్బర్ అలీ, ఆదర్శ్‌కుమార్, మూసా కలీం, పరిపూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు.
అన్ని అంశాల్లో కలిపి 3,602 మంది
క్రీడాకారుల హాజరు
Comments
Please login to add a commentAdd a comment