సర్వేలో వేగం పెంచాలి..
బోనకల్/చింతకాని: ఇందిరమ్మ ఇళ ్లకోసం అందిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో చేపడుతున్న సర్వే త్వరగా పూర్తయ్యేలా వేగం పెంచాలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత సూచించారు. బోనకల్, చింతకాని మండలాల్లోని పలు గ్రామాల్లో సర్వేను శనివారం పరిశీలించిన ఆమె సిబ్బందికి సూచనలు చేశారు. అయితే, యాప్‌లో వివరాలు నమోదు చేసే క్రమాన సమస్యలు వస్తున్నాయని కార్యదర్శులు చెప్పగా ఎక్కువ దరఖాస్తులు ఉన్న గ్రామాల్లో అదనంగా లాగిన్లు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీఓలు శాస్త్రి, ఫిరోజ్ కౌసర్, పంచా యతీ కార్యదర్శులు వినోద్‌కుమార్, రాము, చిరంజీవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment