గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న జపాన్ ఫుట్ బాల్ మేనేజర్ జావియర్ అగ్యుర్ ను తిరిగి అవే బాధ్యతలు అప్పజెప్పటానికి ఆ దేశ ఫుట్ బాల్ అసోసియేషన్ రంగం సిద్ధం చేసింది.
టోక్యో: గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న జపాన్ ఫుట్ బాల్ మేనేజర్ జావియర్ అగ్యుర్ కు తిరిగి అవే బాధ్యతలు అప్పజెప్పటానికి ఆ దేశ ఫుట్ బాల్ అసోసియేషన్ రంగం సిద్ధం చేసింది. గతంలో స్పెయిన్ లో ఒక లీగ్ మ్యాచ్ సందర్బంగా జావియర్ అగ్యుర్ పై ఫిక్సింగ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో అతన్ని మేనేజర్ బాధ్యతలను తప్పించారు. అయితే ఆసియా కప్ క్వార్టర్ ఫైనల్లో జపాన్ పేలవమైన ప్రదర్శనతో ఇంటి దారి పట్టింది.
దీంతో అతన్ని జట్టు మేనేజర్ గా జావియర్ తిరిగి చేర్చుకోవాలని ఫుట్ బాల్ అసోసియేషన్ భావిస్తోంది. త్వరలోనే జావియన్ తిరిగి జట్టుతో కలుస్తాడని జేఎఫ్ఏ చైర్మన్ కునియా దైనీ స్పష్టం చేశారు. 'జపాన్ ఫుట్ బాల్ జట్టుకు జావియర్ సేవలు అవసరం. అతను విధులను సక్రమంగా నిర్వర్తించి దేశ పుట్ బాల్ ఉన్నతికి సహకరించాడు. అందుచేత అతన్ని మళ్లీ మేనేజర్ గా నియమిస్తున్నాం' అని దైనీ తెలిపాడు.