
ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్‌లో విషాదం చోటుచేసుకుంది. క్లబ్ మాజీ మేనేజర్ ఫ్రాంక్ ఓఫారెల్(94) కన్నుమూశాడు. అనారోగ్య సమస్యలతో మార్చి 6న మృతి చెందారని క్లబ్ సోమవారం అర్థరాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ఫ్రాంక్ ఓ ఫారెల్ మృతికి నివాళి అర్పిస్తూ ట్విటర్‌లో సందేశాన్ని రాసుకొచ్చింది.
''ఫ్రాంక్ ఓ ఫారెల్ ఇక లేరన్న వార్త మమ్మల్ని కలిచివేసింది. ఆయన మా క్లబ్‌కు అందించిన సేవలు మరువలేనివి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. అతని కుటుంబసభ్యలుకు ఇవే మా ప్రగాడ సానభూతి'' అని పేర్కొంది. 1969లో ఎఫ్‌కప్ను మాంచెస్టర్ సిటీకి కోల్పోయినప్పుడు ఫ్రాంక్ గైడ్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత 1971లో మాట్ బస్బీ నుంచి మేనేజర్‌గా బాధ్యతలు తీసుకున్న ఫ్రాంక్ ఓరెల్.. మూడేళ్ల పాటు మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌ను విజయవంతగా నడిపించాడు.
చదవండి: Dean Elgar: 'దేశం వైపా... ఐపీఎల్ వైపా?'.. విధేయత చూపించాల్సిన సమయం
We are deeply saddened to learn that our former manager, Frank O'Farrell, has passed away aged 94.
— Manchester United (@ManUtd) March 7, 2022
Sending thoughts and prayers to his family and friends at this difficult time ❤️
Comments
Please login to add a commentAdd a comment