
Ravi Teja Attend His Manager Srinivas Raju Daughters Half Saree Function: చిన్న చిన్న పాత్రలు చేస్తూ అంచలంచెలుగా ఎదిగి మాస్ హీరోగా తనదైన ముద్ర వేసుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్న రవితేజ ఫుల్ జోష్‌తో షూటింగ్ పూర్తి చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన దగ్గర పనిచేసే వ్యక్తులతో ఎంతో ఉదారంగా ఉంటాడు రవితేజ. వారికి సంబంధించిన వేడుకలకు హాజరవుతూ ఇంట్లో మనిషిలా చూసుకుంటాడు.
రవితేజ వద్ద శ్రీనివాస రాజు మేనేజర్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస రాజుకు అనన్య, నిత్య ఇద్దరు కుమార్తెలు. వారికి హాఫ్ సారీ ఫంక్షన్‌ను ఆదివారం (ఫిబ్రవరి 27) రోజున ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాస్ మహారాజా రవితేజ హాజరై సందడి చేశారు. అనంతరం అనన్య, నిత్యలను ఆశీర్వదించాడు. అలాగే ఈ కార్యక్రమానికి దర్శకుడు అనిల్ రావిపూడి, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్, యంగ్ హీరో తేజ సజ్జా, నటుడు బ్రహ్మాజీ ఫైట్‌మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.