
ముంబై : తాను పనిచేసే సంస్ధలోనే 58 కిలోల బంగారాన్ని దొంగిలించిన ఓ జ్యూవెలరీ స్టోర్ మేనేజర్ అతనికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమర్ద్‌నగర్‌లోని ప్రముఖ బంగారు ఆభరణాల దుకాణం వమన్‌హరి పెథే బ్రాంచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు గురువారం వెల్లడించారు.
స్టోర్‌లో పనిచేసే లోకేష్ జైన్, రాజేంద్ర జైన్‌ల సహకారంతో బ్రాంచ్ మేనేజర్ అంకుర్ రాణే బంగారం చోరీకి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. స్టోర్ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రాంతి చౌక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment