
వెంకట్
బంజారాహిల్స్: ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఐమ్యాక్స్ మేనేజర్ బొప్పన సత్య వెంకట ప్రసాద్ అలియాస్ వెంకట్(44)ను బంజారాహిల్స్ పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. ఐమ్యాక్స్‌లో పని చేస్తున్న నందినగర్‌కు చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వెంకట్ ఆమెను మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
కాగా వెంకట్ బాహుబలి సినిమాలో ప్రభాస్‌కు తండ్రిగా నటించారు. ఇప్పటివరకు 40 సినిమాల్లో వివిధ పాత్రలు పోషించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సినీ నటుడిగా చెప్పుకుంటూ వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకొని లోబర్చుకునేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అమ్మాయిలను సరఫరా చేసేవాడని తెలిపింది. పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.