Imax theater
-
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ఆ థియేటర్లలో ఆదిపురుష్ రిలీజ్ లేనట్లేనా?
రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తిరుపతిలో భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదిపురుష్ చిత్రానికి ఊహించని షాక్ తగిలింది. ఆదిపురుష్ సినిమాను 3డీలో థియేటర్లలో రిలీజ్ చేయడం లేదంటూ ఓ వార్త నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దీంతో త్రీడీలో ప్రభాస్ మూవీ చూడాలనుకున్న ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అదే రోజు హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం 'ది ఫ్లాష్' విడుదలవుతున్నందున, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ఐమ్యాక్స్ స్క్రీన్స్ బ్లాక్ చేసిందని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ శ్రీధర్ పిల్లై ఆదిపురుష్ త్రీడీలో రిలీజ్ కావడం లేదంటూ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్స్ టీ-సిరీస్ యాజమాన్యానిది చెత్త ప్లానింగ్ అంటూ మండిపడుతున్నారు. అటు అభిమానులు మాత్రం ఆదిపురుష్ త్రీడీలో రిలీజ్ చేయాలంటూ దర్శకుడు ఓం రౌత్, టి-సిరీస్ నిర్మాత భూషణ్ కుమార్‌కి ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ వార్తల్లో నిజంలేదు తాజాగా ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించింది. ఆదిపురుష్ 2డీతో పాటు 3డీలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. సినిమాపై వచ్చే ఎటువంటి పుకార్లను నమ్మవద్దని కోరింది. కాగా ఆదిపురుష్ జూన్ 16న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. There is a 3D release https://t.co/VcqZpffCXl — Karthik Gowda (@Karthik1423) June 12, 2023 -
పేరుకే అతిపెద్ద స్క్రీన్.. ఐమాక్స్‌లో సినిమా కష్టాలు
సాక్షి, ఖైరతాబాద్: ఏ కొత్త సినిమా విడుదలైనా ప్రజలు ఐమాక్స్‌కు క్యూ కడతారు. అయితే నిర్వాహకులు సినిమాకు వచ్చే వారి వద్ద టికెట్ డబ్బులు వసూలు చేయడం తప్ప సందర్శకుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. సినిమాకు వచ్చేవారు సరైన పార్కింగ్ సదుపాయం లేక నరక యాతన పడుతున్నా యాజమాన్యం నో పార్కింగ్, పార్కింగ్ ఫుల్ అంటూ బోర్డులు పెట్టి చేతులు దులుపుకుంటోంది. పార్కింగ్ నిండిపోయిందని షో పూర్తయ్యే వరకు వేచి ఉండాలంటూ సెక్యురిటీ సిబ్బంది చెబుతుండటంతో సందర్శకులు దిక్కు తోచని స్థితిలో రోడ్డుపైనే వాహనాలను పార్కింగ్ చేసి హడావిడిగా షో టైం అవుతోందని పరుగులు తీస్తున్నారు. దీంతో ఐమాక్స్ నుంచి ఇందిరాగాంధీ చౌరస్తా వరకు ట్రాఫిక్ జాం అవుతోంది. గతంలో ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ స్థలంలో కార్లను పార్కింగ్ చేసుకునేవారు. ప్రస్తుతం ఆ స్థలంలో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో సదరు స్థలంలో పార్కింగ్ చేసుకునేందుకు వీలులేకుండా పోయింది. ఐమాక్స్ ఎదురుగా ఉన్న జీహెచ్ఎంసీ స్థలంలో స్థలంలోనూ ఖైరతాబాద్ ప్రాంత వాసులకోసం మల్టీ లెవల్ ఫంక్షన్‌హాల్ నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. ఆ స్థలంలో ప్రస్తుతం పార్కింగ్ కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తులు బైక్‌కు రూ. 30, కార్లకు రూ. 50 చొప్పున వసూలు చేస్తున్నారు. ఐమాక్స్‌లో అతిపెద్ద సినిమా థియేటర్‌తో పాటు మొత్తం 6 థియేటర్లు ఉంటాయి. ఇవన్నీ నిండితే ఒకేసారి 500 పైగా కార్లు, బైక్‌లు వస్తాయి. ఐమాక్స్ సెల్లార్లో కేవలం 100 నుంచి 150 కార్లు, బైక్‌లకు మాత్రమే పార్కింగ్ సౌకర్యం ఉంది. దీంతో మిగతా వాహనాలను రోడ్డుపై పార్క్ చేసుకోవాల్సిందే. యాజమాన్యం సందర్శకుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదనేందుకు గురువారం రాత్రి జరిగిన సంఘటనే నిదర్శనం. రాత్రి 11.15 నిమిషాలకు చివరి షోకు సందర్శకులు ఎస్కలేటర్ మీదుగా వెళ్తుండగా, అటు వైపు నుంచి షో ముగించుకొని వచ్చిన వారు ఎదురుగా రావడంతో ఎస్కలేటర్‌పై ఉన్న వారు ముందుకు వెళ్లేందుకు స్థలం లేక కేకలు వేశారు. వెంటనే ఎస్కలేటర్‌ను ఆపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
ఫంక్షన్.. ఉండదిక టెన్షన్
సాక్షి హైదరాబాద్: నగరంలోని ఐమాక్స్ దగ్గరలో అత్యాధునిక మల్టీపర్పస్ కన్వెన్షన్ హాల్ నిర్మించనున్నారు. ప్రజల సదుపాయార్థం హెచ్ఎండీఏకు చెందిన కోట్లాది రూపాయల విలువైన స్థలంలో దీనిని నిర్మించనున్నారు. సంపన్నులు తమ శుభకార్యాలకు వినియోగించే ఫంక్షన్ హాళ్ల మాదిరిగా వివిధ వర్గాల వారికి సైతం తగిన సదుపాయాలతో కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. మంత్రి కేటీఆర్ చొరవతో.. ఐమాక్స్ సమీపంలోని ఇందిరానగర్‌లో డబుల్బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవానికి ఇటీవల హాజరైన మంత్రి కేటీఆర్‌ను స్థానిక ప్రజా ప్రతినిధులు సదరు స్థలాన్ని జీహెచ్ఎంసీకి అప్పగిస్తే మల్టీపర్పస్ కన్వెన్షన్ హాల్ నిర్మించవచ్చని సూచించారు. పేదలు, దిగువ మధ్యతరగతి సైతం సదుపాయంగా ఉంటుందని తెలిపారు. సమ్మతించిన మంత్రి.. ఇందుకోసం కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఫంక్షన్ హాల్ కోసం కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. దాదాపు 7 వేల చదరపు గజాల ఖాళీస్థలంలో కన్వెన్షన్‌హాల్‌ను నిర్మించనున్నారు. అన్ని వర్గాలకూ అందుబాటులో.. పేదలు, సంపన్నులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారికి సదుపాయంగా ఉండేలా నిర్మించే యోచనలో అధికారులున్నారు. అందుకుగాను తగిన డిజైన్లు తదితరమైన వాటి కోసం ‘ఆర్ట్ ఆఫ్ ది స్టేట్‌గా’ ఉండేలా కన్సల్టెన్సీ సేవల కోసం టెండర్లు పిలిచారు. స్ట్రక్చరల్, సివిల్, ఎలక్ట్రికల్‌కు సంబంధించిన ఇంజినీరింగ్ డ్రాయింగ్స్‌తో పాటు ఫైర్‌సేఫ్టీ, ల్యాండ్ స్కేపింగ్ తదితర ఏర్పాట్లన్నీ సవివరంగా, సమగ్రంగా డీపీఆర్ సమర్పించాల్సిందిగా కన్సల్టెన్సీలను ఆహ్వానించారు. ఎన్ని అంతస్తులు, ఎంత వ్యయం కానుంది వంటి వివరాలను సైతం కన్సల్టెన్సీలు అందజేయాలి. డిజైన్ ఖరారయ్యాక పనులు ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు పూర్తయి. ప్రజలకు వినియోగంలోకి వచ్చేంతవరకు ఎంపికయ్యే కన్సల్టెన్సీ సంస్థ పనిచేయాల్సి ఉంటుంది. ప్రముఖ ప్రదేశాలకు చేరువలో.. ఐమాక్స్‌కు ఎదురుగా నిర్మించబోయే మల్టీపర్పస్ కన్వెన్షన్ హాల్‌కు సమీపంలోనే కొత్త సచివాలయం రానుంది. దాని నిర్మాణ పనులు పగలూ, రాత్రి వేగంగా జరుగుతున్నాయి. కన్వెన్షన్ హాల్‌కు దగ్గరలోనే రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్.అంబేడ్కర్ 125 అడుగుల ఎత్తయిన విగ్రహం కూడా ఏర్పాటు కానుంది. హుస్సేన్‌సాగర్, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు సైతం సమీపంలోనే ఉన్నాయి. (చదవండి: రైళ్లు ఢీకొనకుండా...ఆటోమెటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టం ‘కవచ్’) -
తెరుచుకున్న థియేటర్లు.. ఐమ్యాక్స్‌లో మెగా హీరో
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత మార్చిలో మూతపడిన హైదరాబాద్ సినిమా థియేటర్లు నేటి నుంచి తిరిగి తెరుచుకున్నాయి. దీంతో చాలా రోజుల తర్వాత బిగ్‌స్రీన్‌పై సినిమా చూసేందుకు సామాన్య ప్రజలంతా ఉత్సుకతతో ఉన్నారు. అయితే దీనికి సెలబ్రెటీలు మినహాయింపు కాదు. దాదాపు 8 నెలలు తర్వాత థియేటర్లు తెరుచుకోవడంతో హీరో సాయిధరమ్ తేజ్ సినిమా చూసేందుకు రెడీ అయిపోయాడు. ప్రసాద్ మల్టీప్టెక్స్ ఐమ్యాక్స్‌లో ఇవాళ విడుదలైన ‘టెనెట్’ సినిమా చూసేందుకు వెళుతున్న వీడియోను శుక్రవారం ఉదయం తన ట్వీటర్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ రోజే థియేటర్లు తెరుచుకోవడం.. హాలీవుడ్ సినిమా 'టెనెట్' కూడా విడుదల కావడంతో లాక్డౌన్ తర్వాత హైదరాబాద్ బిగ్స్రీన్ఫైకి వచ్చిన మొదటి చిత్రం అయ్యింది. దీంతో హాలీవుడ్ చిత్రం చూసేందుకు.. తేజ్ తన ఇంటి నుంచి బయలుదేరి ఆ తర్వాత థియేటర్లో అడుగుపెడుతున్న దృశ్యాన్ని వీడియో రూపంలో పంచుకున్నాడు. (చదవండి: ప్రభాస్ ‘సలార్’ టైటిల్ అర్థం ఏంటేంటే..) ఇక ఈ వీడియో చివరిలో తేజ్ మాట్లాడుతూ.. దాదాపు ఎనిమిది నెలల తర్వాత వెండితెరపై సినిమా చూడటం కొత్త అనుభూతిని ఇస్తుందని ఆనందం వ్యక్తం చేశాడు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా తిరిగి థియేటర్లకు రావాలని కోరాడు. ‘చాలాకాలం తర్వాత థియేటర్‌కు రావడం సంతోషంగా ఉంది. బిగ్‌స్రీన్‌పై సినిమాను చూడటమంటేనే అద్భుతమైన వినోదం. చాలామంది కూడా ఇలానే భావిస్తారు. సినిమాను మళ్లీ సెలబ్రేట్ చేసుకుందాం’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే థియేటర్‌కు వచ్చే ముందు ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్‌లు ధరించాలని, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలని తేజ్ సూచించాడు. సాయి ధరమ్ తేజ్‌తో పాటు దర్శకుడు మారుతి కూడా ప్రసాద్ ఐమ్యాక్స్‌కు వచ్చి సినిమా చూశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...తాము సినిమాకు వచ్చామని, తిరిగి థియేటర్లకు వస్తుంటే, మళ్లీ తమ జీవితాల్లోకి వచ్చిన అనుభూతినిస్తుందన్నారు. ప్రేక్షకులంతా కూడా థియేటర్లలో సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలని ఆయన పిలుపునిచ్చాడు. (చదవండి: అనసూయ ‘థ్యాంక్ యు బ్రదర్’) It feels good to be back at the theater after a long long time. Watching a movie on the big screen is the ultimate form of entertainment for me. I know many of you feel the same. Let's celebrate cinema again in it's finest form from today. #CelebratingCinema pic.twitter.com/hUylnVhYO6 — Sai Dharam Tej (@IamSaiDharamTej) December 4, 2020 -
ఐమ్యాక్స్ థియేటర్ మేనేజర్ అరెస్ట్
బంజారాహిల్స్: ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఐమ్యాక్స్ మేనేజర్ బొప్పన సత్య వెంకట ప్రసాద్ అలియాస్ వెంకట్(44)ను బంజారాహిల్స్ పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. ఐమ్యాక్స్‌లో పని చేస్తున్న నందినగర్‌కు చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వెంకట్ ఆమెను మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా వెంకట్ బాహుబలి సినిమాలో ప్రభాస్‌కు తండ్రిగా నటించారు. ఇప్పటివరకు 40 సినిమాల్లో వివిధ పాత్రలు పోషించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సినీ నటుడిగా చెప్పుకుంటూ వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకొని లోబర్చుకునేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అమ్మాయిలను సరఫరా చేసేవాడని తెలిపింది. పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
'కబాలీ'పై టాలీవుడ్ ఏమంటోంది!
హైదరాబాద్: భాగ్యనగరంలో ఎక్కడ చూసిన 'కబాలీ' ఫీవర్ కనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ మూవీ చూసేందుకు ఇన్నాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. మూవీ చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులు, సెలబ్రిటీలు పరుగులు పెడుతున్నారు. హైదరాబాద్ లో ఐమాక్స్ థియేటర్ వద్ద టాలీవుడ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు డాన్ 'కబాలీ' తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 'చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. నా రూములో ఆయన పోస్టర్లు ఉన్నాయి. రజనీకాంత్ అంటే పిచ్చి. గతంలో రజనీ ఏ సినిమా చూసేందుకు ఇలా ఎదురు చూడలేదు. డిఫరెంట్ లుక్, మేజరిజమ్, భాషా లాంటి గెటప్ లో కనిపించడంతో ప్రేక్షకులలో ఆసక్తి రెట్టింపయింది. ఆయన స్టైల్ గురించి చెప్పక్కర్లేదు' అని స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు, యంగ్ హీరో పూరి ఆకాశ్ అన్నాడు. 'రజనీకాంత్ ప్రతి సినిమాకు ఇలాంటి వాతావరణం ఉంటుంది. ఎవరికీ అర్థంకాని అదో విచిత్రమైన ఫినామినా. రజనీ తనను ఏమైనా కొత్తగా ఆవిర్కరించుకున్నారా అనే ఆసక్తి ప్రేక్షకులలో ఉంది. పాపులర్ స్టార్ మాత్రమే కాదు ఆయన ఓ అద్భుతమైన నటుడు. అమితాబ్ 60 ఏళ్ల తర్వాత ఎలాంటి సినిమాలు చేస్తున్నారో చూశాం. అంతకంటే ఎక్కువగా రజనీ గారు తన సినిమాల్లో కనిపిస్తారని అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటివరకూ ఆయనను 100 శాతం తెరమీద ఆవిష్కరించిన సినిమా రాలేదు' అని డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ పేర్కొన్నాడు. 'కథ కోసం రాలేదు. కేవలం ఆయన స్టైల్, మ్యానరిజమ్ కోసం వచ్చాను. దేశం మొత్తం రజనీ ఫివర్ ఉంది. ఈ వయసులోనూ ఆయన సంచలనాలు చేస్తారని , రెండున్నర గంటలు ఆయన ఎంటర్ టైన్ చేస్తానని మూవీ చూసేందుకు వచ్చాను' అని టాలీవుడ్ స్క్రిప్ట్ రైటర్ వక్కంతం వంశీ రజనీపై అభిమానాన్ని చాటుకున్నాడు. 'అంతులేనికథ'లో రజనీకాంత్ చేసిన తాగుబోతు పాత్ర నుంచి ఆయనను అభిమానిస్తున్నాను. ఆయన ఇంకా చాలా సినిమాలు చేయాలని, ఆయన మరింత ఆరోగ్యంతో ఉండాలని ప్రొడ్యూసర్ లగడిపాటి శ్రీదర్ కోరుకున్నాడు. టాలీవుడ్ లోనే కాదు, హాలీవుడ్ లోనూ ఇంత క్రేజ్ ఉన్న హీరో మరోకరు లేరు. రజనీ సార్ కు వీర ఫ్యాన్ ను. చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీ వచ్చింది. డిఫరెంట్ లుక్ ముఖ్యంగా గెడ్డంతో కనిపించడం ఆకట్టుకుంటుంది అంటూ సెలబ్రిటీలు 'కబాలీ' గురించి చెబుతున్నారు. -
'కబాలీ'పై టాలీవుడ్ ఏమంటోంది!