
రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తిరుపతిలో భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆదిపురుష్ చిత్రానికి ఊహించని షాక్ తగిలింది. ఆదిపురుష్ సినిమాను 3డీలో థియేటర్లలో రిలీజ్ చేయడం లేదంటూ ఓ వార్త నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దీంతో త్రీడీలో ప్రభాస్ మూవీ చూడాలనుకున్న ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అదే రోజు హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం 'ది ఫ్లాష్' విడుదలవుతున్నందున, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ఐమ్యాక్స్ స్క్రీన్స్ బ్లాక్ చేసిందని ప్రచారం జరుగుతోంది.
ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ శ్రీధర్ పిల్లై ఆదిపురుష్ త్రీడీలో రిలీజ్ కావడం లేదంటూ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్స్ టీ-సిరీస్ యాజమాన్యానిది చెత్త ప్లానింగ్ అంటూ మండిపడుతున్నారు. అటు అభిమానులు మాత్రం ఆదిపురుష్ త్రీడీలో రిలీజ్ చేయాలంటూ దర్శకుడు ఓం రౌత్, టి-సిరీస్ నిర్మాత భూషణ్ కుమార్‌కి ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆ వార్తల్లో నిజంలేదు
తాజాగా ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించింది. ఆదిపురుష్ 2డీతో పాటు 3డీలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. సినిమాపై వచ్చే ఎటువంటి పుకార్లను నమ్మవద్దని కోరింది. కాగా ఆదిపురుష్ జూన్ 16న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
There is a 3D release https://t.co/VcqZpffCXl
— Karthik Gowda (@Karthik1423) June 12, 2023
Comments
Please login to add a commentAdd a comment