ఏసీబీ వలలో మునిసిపల్ తిమింగలాలు
ఏసీబీ వలలో మునిసిపల్ తిమింగలాలు
Published Fri, Jul 29 2016 8:26 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
పాలకొల్లు టౌన్: కారుణ్య నియామకం కింద ఉద్యోగం కోసం రూ.30 వేలు డిమాండ్ చేసిన మునిసిపల్ మేనేజర్ ఇందుకు సహకరించిన మునిసిపల్ గుమస్తాను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకుని అరెస్ట్ చేసిన సంఘటన పాలకొల్లు పురపాలక సంఘంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పాలకొల్లు మునిసిపల్ కార్యాలయంలో శిలార ఆంజనేయ దుర్గాప్రసాద్ అటెండర్‌గా పనిచేస్తూ గత ఏప్రిల్ 13న గుండెపోటుతో మృతిచెందారు. అతని కుమారుడు హరీష్‌కు మునిసిపాలిటీలో ఉద్యోగం ఇప్పించాలని మృతుని భార్య రమామణి మునిసిపల్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
నాలుగు నెలలు గడుస్తున్నా దీనికి సంబంధించిన ఫైల్‌ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా మునిసిపల్ మేనేజర్ ఎ.తారకనాథ్ కాలయాపన చేస్తున్నారు. రూ.30 వేలు ఇస్తేనే ఫైల్ కదులుతుందని డిమాండ్ చేశారు. దీనిపై మతుడు బావమరిది మునిసిపల్ లై్ర» రీలో అటెండర్‌గా పనిచేస్తున్న కటికిరెడ్డి చక్రధరరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వలపన్ని రూ.30 వేలను చక్రధరరావుకు ఇచ్చి పంపారు. చక్రధరరావు ఈ మొత్తాన్ని తీసుకుని మునిసిపల్ కార్యాలయానికి రాగా గుమస్తా సి.గోపాలకృష్ణకు ఇవ్వాలని మేనేజర్ తారకనాథ్ సూచించారు. దీంతో సొమ్మును గోపాలకష్ణకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర మునిసిపాలిటీలో ఫైళ్లను పరిశీలించి కమిషనర్ కోనేరు సాయిరామ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లంచం అడిగిన మునిసిపల్ మేనేజర్ ఎ.తారకనాథ్‌ను, సొమ్ము తీసుకున్న గుమస్తా గోపాలకృష్ణను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా తారకనాథ్ గతంలో కర్నూలు జిల్లా బనగానపల్లి మునిసిపల్ కమిషనర్‌గా పనిచేస్తుండగా ఓ వ్యవహారంలో లంచం తీసుకుంటూ దొరికిపోయాని ఏసీబీ అధికారులు తెలిపారు. పాలకొల్లు మునిసిపాలిటీ చరిత్రలో లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసు ఇదే మొదటిది కావడం మునిసిపల్ ఉద్యోగుల్లో కలకలం రేపింది.
Advertisement
Advertisement