సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని రాడిసన్ హోటల్ కేంద్రంగా సాగిన పేకాటలో హైటెక్ చీటింగ్ దందాలు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీను నేతృత్వంలోని తొమ్మిది మందితో కూడిన ముఠాను పట్టుకున్నారు. వీరితో పాటు పేకాట ఆడుతున్న నలుగురినీ అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ అధికారులకు అప్పగించారు. నిందితులకు నోటీసులు జారీ చేశామని బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ పి.సతీష్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని సుభా‹Ùనగర్‌కు చెందిన సింగిడి శ్రీనివాస్ అలియాస్ శ్రీను తన స్నేహితులతో కలిసి తరచూ గోవాలోని క్యాసినోవాలకు వెళ్లి వస్తుండేవారు. అక్కడ పేకాటలో భారీగా నష్టపోయిన ఇతగాడు అదే ఆటలో మోసాలకు పథక రచన చేశాడు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సూర్య, మెరి్వన్, చంద్రశేఖర్, గుర్‌మీత్ సింగ్, సంతోష్ కుమార్, సయ్యద్ నయీం, వేణు, వినోద్‌లతో ముఠా ఏర్పాటు చేశాడు.
ఎదుటి వారి పేక ముక్కలు కనిపించేలా..
ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచి్చన శ్రీను రూ.25 వేలు వెచి్చంచి ఎక్స్‌రే విజన్ కాంటాక్ట్ లెన్స్‌ను ఖరీదు చేశాడు. పేకాట సమయంలో ఎవరైనా దీన్ని ధరిస్తే ఎదుటి వ్యక్తి చేతిలోని ముక్కలు ఏంటో తెలుసుకోవచ్చు. దీన్ని ఎలా వినియోగించాలనేది మెరి్వన్ యూ ట్యూబ్ ద్వారా తెలుసుకుని ధరిచడం మొదలెట్టాడు. గోవాలో పేకాట నేపథ్యంలో పరిచయమైన సరితకు తాము రాడిసన్ హోటల్ కేంద్రంగా భారీ పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో ఈమెతో పాటు బంధువులు, స్నేహితులు అయిన సాయి కృష్ణ, వినోద్‌కుమార్, కుమారీ అక్కడకు వచ్చి పేకాట ఆడేందుకు ఆసక్తి చూపారు.
దీంతో ముందే రూ.1.5 లక్షల తన ఖాతాలో డిపాజిట్ చేయించుకున్న శ్రీను.. తన ముఠాకు చెందిన వాళ్లనూ పేకాట ఆడే వారి మాదిరిగానే రంగంలోకి దింపాడు. తన ఖాతాలో పడిన మొత్తం నుంచి రూ.24 వేలు వెచి్చంచిన శ్రీను.. రాడిసన్ హోటల్‌లో స్వీట్ రూమ్ బుక్ చేశాడు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడుకు చేరుకున్న అంతా పేకాట ఆడటం మొదలెట్టారు. వినోద్ తదితరులకు శ్రీను రూ.4,500 విలువైన కాయిన్లు కూడా ఇచ్చాడు. ఎక్స్‌రే విజన్ కాంటాక్ట్ లెన్స్ ధరించిన మెరి్వన్ వినోద్‌కుమార్, సరిత చేతుల్లోని పేక ముక్కలు తెలుసుకుని.. తన ముఠా సభ్యుల సాయంతో వాళ్లు ఓడిపోయేలా చేస్తున్నాడు. ఇది పశ్చిమ మండల టాస్‌్కఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేసిన అధికారులు 13 మందినీ అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.2400 నగదు, 4500 కాయిన్లు, లెన్స్‌ను స్వాధీనం చేసుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.
శ్రీను తన గ్యాంగ్‌లోని వారికి ఒక్కో విడతకు రూ.2 వేలు చొప్పున చెల్లిస్తున్నాడని, లెన్స్ ధరించి సాంకేతిక సహకారం అందించే మెరి్వన్‌కు మాత్రం రూ.5 వేలు చొప్పున ఇస్తున్నాడని పోలీసులు గుర్తించారు. శ్రీను ఖాతాలో ఉన్న రూ.84 వేలు సైతం ఫ్రీజ్ చేశారు. ఈ గ్యాంగ్ గతంలోనూ కొందరిని ఇలా మోసం చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. పేకాట శిబిరం నిర్వహిస్తున్న శ్రీను, అతడి గ్యాంగ్‌తో పాటు పేక ఆడటానికి వచి్చన నలుగురికీ నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment