poker Adda
-
రోజుకో చోట.. మూడు ముక్కలాట!
ఆళ్లగడ్డ: మళ్లీ బేరం కుదిరింది. పేకాట మొదలైంది. టీడీపీ నేతలు, పోలీసులు కలిసిపోయి జూదాన్ని జోరుగా నడిపిస్తున్నారు. రోజుకో చోట పేకాట శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. అధికారులెవరూ అటు వైపు రాకూడదన్నది నిబంధన. ఎవరైనా ఉన్నతాధికారులు వచ్చినా స్థావరానికి రాకుండా డైవర్ట్ చేయాలి. ఇదీ.. పోలీసులు, పేకాట స్థావరాల నిర్వాహకుల మధ్య కుదిరిన డీల్. రెండున్నర నెలల తర్వాత ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పేకాట మాఫియా మళ్లీ జూలు విదిల్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు నుంచే విచ్చలవిడిగా జూద శిబిరాలు నడిపించారు టీడీపీ నేతలు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న జిల్లా ఎస్పీ గట్టి చర్యలు తీసుకోవడంతో పేకాట శిబిరాలు ఆగిపోయాయి. ఇప్పుడు కొందరు పోలీసులతో ఒప్పందం కుదరడంతో మళ్లీ ‘ఆట’ మళ్లీ మొదలైంది. కొందరు పోలీసు అధికారులకు పోస్టింగ్ ఇచ్చే సమయంలోనే అన్నీ ఒప్పుకుని వచ్చినందున పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.పేకాట శిబిరాల నిర్వహణలో ఘనుడైన చాగలమర్రి మండల టీడీపీ నేతే ఈ శిబిరాలకు రింగ్ లీడరన్న ప్రచారం ఉంది. ఆయన ఇటీవల ఓ పోలీస్ అధికారితో కలిసి చాగలమర్రి మండలంలో భారీగా శిబిరాలు ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. జూదాన్ని అరికట్టాల్సిన ఓ పోలీసు అధికారే ఈయనతో చేతులు కలిపి పేకాట ఆడిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కోవెలకుంట్ల సర్కిల్లో పని చేస్తున్న సమయంలో కూడా ఆ పోలీసు అధికారి విచ్చలవిడిగా పేకాట శిబిరాలు నిర్వహించి కోట్లు కూడబెట్టుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. పేకాట శిబిరాలకు అనుమతించాలన్న ఒప్పందంతోనే ఆయన ఇక్కడ పోస్టింగ్ తెచ్చుకున్నట్లు సమాచారం. సాంకేతికత సాయంతో.. జూదరులకు ఏరోజు ఎక్కడ పేకాట అడించేదీ అరగంట ముందు చెబుతారు. ప్లేస్ నిర్ణయించి సెల్ ఫోన్లో లొకేషన్ పెడతారు. ఆ లొకేషన్ ఇతరులకు షేర్ చేసేందుకు అవకాశం ఉండదు. వచ్చే దారిలోనే సెల్ఫోన్లు ఒక చోట భద్రంగా ఉంచుతారు. పోలీస్ స్టేషన్ నుంచి పేకాట శిబిరం వరకు 10 మంది కావలి ఉంటారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే సమాచారం చేరవేసి శిబిరాన్ని ఖాళీ చేయిస్తారు. తర్వాత పోలీసులు రావడం, అక్కడ ఏమీ లేదని ఉన్నతాధికారులకు తెలియజేయడం నిత్యం జరిగే వ్యవహారం.రోజుకు చేతులు మారుతున్నది రూ. 3 కోట్లునిన్నటి వరకు నియోజకవర్గం సరిహద్దు జిల్లాలోని అటవీ, వ్యవసాయ పొలాల వేదికగా కార్యకలాపాలు సాగించిన ఈ ముఠా ఇప్పుడు చాగలమర్రికి చుట్టు పక్కల ఖాళీ స్థలాలు, వ్యవసాయ బీడు భూములు, గని గుంతల్లో జూదం నిర్వహిస్తున్నారు. ఇక్కడికి చుట్టుపక్కల జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి కూడా భారీగాజూదరులువస్తున్నారు. పేకాట శిబిరాల్లో జూదరులు ఆడేది అంతా అందర్బార్ (మంగపత్త). ఈ జూదంలో రోజుకు కనీసం రూ. 3 కోట్లుచేతులు మారుతున్నట్లు సమాచారం. కోసు పడుచుకునే వ్యక్తి ఒక్కొక్కరు రూ. 5 వేలు చెల్లించాలి. కనీసం రూ. 5 లక్షలు జేబులో ఉండాలి. 30 నుంచి 50 మంది పాల్గొనే ఈ ఆటలో బరి కోసమే రూ 1.50 లక్షల నుంచి రూ 2.50 లక్షలు కమీషన్ తీసుకుంటున్నారు. -
పేకాటలో హైటెక్ చీటింగ్!
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని రాడిసన్ హోటల్ కేంద్రంగా సాగిన పేకాటలో హైటెక్ చీటింగ్ దందాలు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీను నేతృత్వంలోని తొమ్మిది మందితో కూడిన ముఠాను పట్టుకున్నారు. వీరితో పాటు పేకాట ఆడుతున్న నలుగురినీ అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ అధికారులకు అప్పగించారు. నిందితులకు నోటీసులు జారీ చేశామని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పి.సతీష్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని సుభా‹Ùనగర్‌కు చెందిన సింగిడి శ్రీనివాస్ అలియాస్ శ్రీను తన స్నేహితులతో కలిసి తరచూ గోవాలోని క్యాసినోవాలకు వెళ్లి వస్తుండేవారు. అక్కడ పేకాటలో భారీగా నష్టపోయిన ఇతగాడు అదే ఆటలో మోసాలకు పథక రచన చేశాడు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సూర్య, మెరి్వన్, చంద్రశేఖర్, గుర్మీత్ సింగ్, సంతోష్ కుమార్, సయ్యద్ నయీం, వేణు, వినోద్‌లతో ముఠా ఏర్పాటు చేశాడు. ఎదుటి వారి పేక ముక్కలు కనిపించేలా.. ఆన్లైన్లో ఆర్డర్ ఇచి్చన శ్రీను రూ.25 వేలు వెచి్చంచి ఎక్స్‌రే విజన్ కాంటాక్ట్ లెన్స్‌ను ఖరీదు చేశాడు. పేకాట సమయంలో ఎవరైనా దీన్ని ధరిస్తే ఎదుటి వ్యక్తి చేతిలోని ముక్కలు ఏంటో తెలుసుకోవచ్చు. దీన్ని ఎలా వినియోగించాలనేది మెరి్వన్ యూ ట్యూబ్ ద్వారా తెలుసుకుని ధరిచడం మొదలెట్టాడు. గోవాలో పేకాట నేపథ్యంలో పరిచయమైన సరితకు తాము రాడిసన్ హోటల్ కేంద్రంగా భారీ పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో ఈమెతో పాటు బంధువులు, స్నేహితులు అయిన సాయి కృష్ణ, వినోద్‌కుమార్, కుమారీ అక్కడకు వచ్చి పేకాట ఆడేందుకు ఆసక్తి చూపారు. దీంతో ముందే రూ.1.5 లక్షల తన ఖాతాలో డిపాజిట్ చేయించుకున్న శ్రీను.. తన ముఠాకు చెందిన వాళ్లనూ పేకాట ఆడే వారి మాదిరిగానే రంగంలోకి దింపాడు. తన ఖాతాలో పడిన మొత్తం నుంచి రూ.24 వేలు వెచి్చంచిన శ్రీను.. రాడిసన్ హోటల్లో స్వీట్ రూమ్ బుక్ చేశాడు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడుకు చేరుకున్న అంతా పేకాట ఆడటం మొదలెట్టారు. వినోద్ తదితరులకు శ్రీను రూ.4,500 విలువైన కాయిన్లు కూడా ఇచ్చాడు. ఎక్స్‌రే విజన్ కాంటాక్ట్ లెన్స్ ధరించిన మెరి్వన్ వినోద్‌కుమార్, సరిత చేతుల్లోని పేక ముక్కలు తెలుసుకుని.. తన ముఠా సభ్యుల సాయంతో వాళ్లు ఓడిపోయేలా చేస్తున్నాడు. ఇది పశ్చిమ మండల టాస్‌్కఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేసిన అధికారులు 13 మందినీ అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.2400 నగదు, 4500 కాయిన్లు, లెన్స్‌ను స్వాధీనం చేసుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. శ్రీను తన గ్యాంగ్‌లోని వారికి ఒక్కో విడతకు రూ.2 వేలు చొప్పున చెల్లిస్తున్నాడని, లెన్స్ ధరించి సాంకేతిక సహకారం అందించే మెరి్వన్‌కు మాత్రం రూ.5 వేలు చొప్పున ఇస్తున్నాడని పోలీసులు గుర్తించారు. శ్రీను ఖాతాలో ఉన్న రూ.84 వేలు సైతం ఫ్రీజ్ చేశారు. ఈ గ్యాంగ్ గతంలోనూ కొందరిని ఇలా మోసం చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. పేకాట శిబిరం నిర్వహిస్తున్న శ్రీను, అతడి గ్యాంగ్‌తో పాటు పేక ఆడటానికి వచి్చన నలుగురికీ నోటీసులు జారీ చేశారు. -
పేకాట అడ్డాపై పోలీసుల దాడి
పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ముప్పరాజుపాలెంలో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఐనవోలు పోలీసులు శుక్రవారం సాయంత్రం ముప్పరాజుపాలెంలో పేకాట శిబిరంపై దాడి చేశారు. ఈ సందర్భంగా 8మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.9,250 నగదుతోపాటు మూడు బైక్‌లు, 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.