యూట్యూబ్.. ఈ మధ్య కాలంలో విపరీతంగా వినపడుతున్న పేరు. ప్రత్యేకంగా చెప్పాలంటే వినోదంతో పాటు సామాన్యులను కూడా సెలబ్రిటీలుగా మారుస్తోంది ఈ వీడియో ప్లాట్‌ఫాం. గత కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరుగుతుండటం, ఇంటర్నెట్ తక్కువ ధరకు అందుబాటులోకి రావడంతో వీటి యూజర్లు విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసందే. కొందరు దీని ఎంటర్‌టైన్‌మెంట్ సాధనంగా చూస్తుంటే మరికొందరు తమ ఉపాధికి యూట్యూబ్‌ని మార్గంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వీడియోలు అప్‌లోడ్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే ఓ యూట్యూబర్ అందరూ షాక్ అయ్యేలా ఏడాదికి రూ.312 కోట్లు సంపాదిస్తూన్నాడు. దీంతోపాటు మరికొన్ని సంచలన విషయాలను అతను బయటపెట్టాడు.
ఇదంతా మోసం చేసి సంపాదించాను!
వివరాల్లోకి వెళితే.. మార్క్ ఫిష్‌బాచ్ అనే ఒక యూట్యూబర్ ఒక సంవత్సరంలో యూట్యూబ్ ద్వారా 38 మిలియన్ డాలర్లు (రూ. 312 కోట్లు) సంపాదిస్తున్నాడు. ఈ సంపాదన చూసి అతనే ఆశ్చర్యపోతున్నాడట. అయితే ఎందుకో గానీ ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నట్లు అతనే స్వయంగా అంగీకరించాడు. యూట్యూబ్ ప్రారంభించిన మొదట్లో అనిపించకపోయినా ఇంత పెద్ద మొత్తంలో సంపద రావడంతో మోసం చేస్తున్న భావన కలుగుతున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఇటీవల ఓ వ్యక్తి మార్క్ సంపాదన గురించి అడిగాడు. అందుకు అతను బదులిస్తూ.. ‘యూట్యూబ్ ద్వారా నాకు ఇంత డబ్బు వస్తోందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నేనే నమ్మలేకపోతున్నాను. అయితే ఒక్కోసారి ఈ దారిలో సంపాదించడం నాకు అన్యాయంగా అనిపిస్తుంది. ఈ అంశంపై మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉంటాను, ఎందుకంటే ఈ స్థాయిలో సక్సెస్, సంపాదన రావడం వెనుక సమాజాన్ని మోసగిస్తున్నట్లు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుందని’ తెలిపాడు.
భవిష్యత్తులో తన సంపాదనతో ప్రజలకు సహాయం చేయాలని, వారి స్నేహితులు, బంధువుల జీవితాలను మెరుగుపరచాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఇటీవలే యూట్యూబర్ MrBeast, (అసలు పేరు జిమ్మీ డోనాల్డ్సన్), అతని యూట్యూబ్ ఛానెల్ కోసం $1 బిలియన్ల డీల్‌ను ఆఫర్ చేసిన సంగతి తెలసిందే.
చదవండి: స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
Comments
Please login to add a commentAdd a comment