
బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ తన భార్యను మోసం చేశాడంటూ వదంతులు పుట్టుకువచ్చాయి.

షకీబ్ భార్య ఉమే అహ్మద్ శిశిర్ సోషల్ మీడియా అకౌంట్లో వారిద్దరికి సంబంధించిన ఫొటోలు కనిపించకపోవడమే ఇందుకు కారణం.

అయితే, భర్త తనను మోసం చేశాడంటూ వస్తున్న ఈ వార్తలను శిశిర్ ఖండించింది.

షకీబ్ కేవలం మంచి భర్త మాత్రమే కాదు.. గొప్ప తండ్రి కూడా అని కొనియాడింది

షకీబ్ క్రికెట్ కెరీర్‌పై విమర్శలు చేసే అధికారం అభిమానులకు ఉంది. కానీ తమ వ్యక్తిగత విషయాల్లో తలదూర్చవద్దని శిశిర్ హెచ్చరించింది.

పదమూడేళ్ల క్రితం షకీబ్‌ను కలిసినపుడు ఎలా ఉన్నాడో.. ఇప్పుడూ తనతో అలాగే ఉంటున్నాడని తెలిపింది

జీవిత భాగస్వామిగా షకీబ్‌కు వందకు వంద మార్కులు వేస్తానని భర్తను ప్రశంసించింది

సోషల్ మీడియాలో తమ బంధం గురించి వదంతులు వ్యాప్తి చేయడం సరికాదని శిశిర్ హితవు పలికింది

తాను భర్తతో ఉన్న ఫొటోలు డిలీట్ చేయలేదని.. ప్రైవేట్‌లో మాత్రమే ఉంచానని శిశిర్ క్లారిటీ ఇచ్చింది

షకీబ్ ప్రస్తుతం పాకిస్తాన్‌తో సిరీస్‌తో బిజీగా ఉన్నాడని.. తాను కుటుంబాన్ని చూసుకుంటున్నానని శిశిర్ తెలిపింది.

అనవసరంగా రాద్ధాంతం చేసి తమను డిస్టర్బ్ చేయవద్దని నెటిజన్లకు విజ్ఞప్తి చేసింది.








