న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళను అక్కడి ఏఎస్ఐ తాగి కొట్టారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరులో జరిగింది. కిలారు లక్ష్మీకుమారి, నారాయణ దంపతులు బావినేని బజారులో నివాసముంటున్నారు. వీరికి పొరుగింట్లో ఉన్న తబిత అనే మహిళతో గొడవ జరిగింది. తమను తబిత అకారణంగా దూషిస్తున్నట్లు లక్ష్మీకుమారి 100 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
వెంటనే పోలీసు సిబ్బంది వచ్చి తబితను వారించినా ఫలితం లేకపోవడంతో.. సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయమన్నారు. దీంతో లక్ష్మికుమారి తన కోడలితో కలిసి పెనమలూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కానీ, అక్కడ విధుల్లో ఉన్న ఏఎస్‌ఐ ఫిర్యాదు తీసుకోకపోగా స్టేషన్‌కు వచ్చిన తమపైనే దూషించి చేయిచేసుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం తాగి విధుల్లో ఉన్న సదరు పోలీసు అధికారి దౌర్జన్యంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పెనమలూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
న్యాయం కోసం స్టేషన్కు వెళ్తే.. తాగేసి కొట్టారు!
Published Wed, Dec 10 2014 10:22 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM
Advertisement
Advertisement