woman beaten
-
వివాహేతర సంబంధం పెట్టుకుందని..
సాక్షి, సిరిసిల్ల : వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను గ్రామస్తులు ట్రాక్టర్‌కు కట్టేసి చితకబాదారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోనాల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే.. బోనాల గ్రామానికి చెందిన కున్న లావణ్య భర్త నాగరాజు విదేశాల్లో ఉంటాడు. అయితే ఇక్కడ ఒంటరిగా ఉంటున్న లావణ్య.. అదే గ్రామానికి చెందిన పడుగే నారాయణ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. నారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. లావణ్య, నారాయణల మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు బయటకి పొక్కడంతో గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. దీంతో వారిద్దరు గ్రామం నుంచి పారిపోయారు. వారు సిరిసిల్లలోని శివనగర్‌లో ఒక ఇంట్లో అద్దెకు దిగారు. ఈ విషయం నారాయణ కుటుంబసభ్యులకు తెలియడంతో బుధవారం సాయంత్రం అక్కడికి వెళ్లి అతన్ని ఇంటికి పట్టుకుని వచ్చారు. దీంతో లావణ్య నారాయణ కనిపించడం లేదని.. అతన్ని వారి బంధువులు తీసుకెళ్లారని పోలీసులను ఆశ్రయించారు. అనంతరం లావణ్య నేడు గ్రామానికి చేరుకుని.. నారాయణ ఇంటికి వెళ్లారు. లావణ్య అక్కడికి రావడంతో నారాయణ కుటుంబసభ్యులు ఆమెను బంధించారు. అనంతరం పలువురు గ్రామస్తులతో కలిసి ట్రాక్టర్ ముందు భాగంలో కట్టేసి ఆమెను చితకబాదారు. -
నేవీ ఉద్యోగి నిర్వాకం, చెప్పుదెబ్బలు..
విశాఖ : ఉన్నతమైన హోదాలో ఉండి... విధులు నిర్వహిస్తున్న అతడి ప్రవర్తన పక్కదారి పట్టింది. విచక్షణ మరిచి, ఆకతాయి వేషాలు వేసి అడ్డంగా దొరికిపోయి చివరకు చావు దెబ్బలు తిన్నాడు. విశాఖ పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురంలోని ఎక్స్ సర్వీస్‌మెన్ కాలనీలో ఓ యువతి స్నానం చేస్తుండగా నేవీ ఉద్యోగి తన సెల్ఫోన్లో వీడియో తీశాడు. ఇది గమనించిన సదరు యువతి, కుటుంబ సభ్యులు అతన్ని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుని చితకబాదారు. బాధితురాలు ఆగ్రహంతో నిందితుడిని చెప్పుతో ఎడా పెడా వాయించేసింది. మహిళ ఫిర్యాదు మేరకు మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసి, స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో నిందితుడు నేవీ ఉద్యోగి అని...నేవల్ డాక్‌యార్డ్‌లో పని చేస్తున్నట్లు తేలింది. -
న్యాయం కోసం స్టేషన్‌కు వెళ్తే.. తాగేసి కొట్టారు!
న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళను అక్కడి ఏఎస్ఐ తాగి కొట్టారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరులో జరిగింది. కిలారు లక్ష్మీకుమారి, నారాయణ దంపతులు బావినేని బజారులో నివాసముంటున్నారు. వీరికి పొరుగింట్లో ఉన్న తబిత అనే మహిళతో గొడవ జరిగింది. తమను తబిత అకారణంగా దూషిస్తున్నట్లు లక్ష్మీకుమారి 100 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసు సిబ్బంది వచ్చి తబితను వారించినా ఫలితం లేకపోవడంతో.. సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమన్నారు. దీంతో లక్ష్మికుమారి తన కోడలితో కలిసి పెనమలూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కానీ, అక్కడ విధుల్లో ఉన్న ఏఎస్ఐ ఫిర్యాదు తీసుకోకపోగా స్టేషన్‌కు వచ్చిన తమపైనే దూషించి చేయిచేసుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం తాగి విధుల్లో ఉన్న సదరు పోలీసు అధికారి దౌర్జన్యంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పెనమలూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ముఠా సభ్యుడిని చితకొట్టిన మహిళలు