సీఎం అంటే ఎలా ఉండాలో వైఎస్సార్ చూపించారని, సీఎం అంటే ఏ పనులు చేయకూడదో చంద్రబాబు చూపించారని, వెన్నుపోటు, మోసం నుంచి పుట్టినవాడే చంద్రబాబు అని వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల అన్నారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరులో ఎన్నికల ప్రచార సభలో షర్మిల ప్రసంగిస్తూ.. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను దగా చేశారని, పసుపు-కుంకుమతో మోసపోవద్దని అక్కాచెల్లెమ్మలకు చెప్పండని ప్రజలను కోరారు.