
సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షిస్తున్న కలెక్టర్ ఇంతియాజ్, ఎమ్మెల్యే పార్థసారథి, తలశిల
పెనమలూరు: ఈ నెల 12న పోరంకిలో నిర్వహించనున్నపెనమలూరు నియోజకవర్గ వలంటీర్ల అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటున్నట్టు కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు. ఆయన బుధవారం పోరంకి శివారులోని మురళీ రిసార్ట్స్‌ను పరిశీలించి అవార్డుల కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో ఉత్తమ సేవలందించిన వలంటీర్లలో ఐదుగురికి సేవా వజ్ర, ఐదుగురికి సేవా రత్న, ఏడాదిగా ఎటువంటి అంతరాయం లేకుండా పని చేస్తున్న వలంటీర్లకు సేవా మిత్ర అవార్డులు ప్రదానం చేస్తున్నట్టు తెలిపారు.
పెనమలూరు నియోజకవర్గంలో పనిచేస్తున్న 1,500 మంది వలంటీర్లలో ఉత్తమ సేవలందించిన వలంటీర్లకు సీఎం చేతుల మీదగా అవార్డులిస్తామన్నారు. కార్యక్రమంలో సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, సీపీ బత్తిన శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment