kolusu pardha sarathi
-
12న వలంటీర్లకు అవార్డులు
పెనమలూరు: ఈ నెల 12న పోరంకిలో నిర్వహించనున్నపెనమలూరు నియోజకవర్గ వలంటీర్ల అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటున్నట్టు కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు. ఆయన బుధవారం పోరంకి శివారులోని మురళీ రిసార్ట్స్‌ను పరిశీలించి అవార్డుల కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో ఉత్తమ సేవలందించిన వలంటీర్లలో ఐదుగురికి సేవా వజ్ర, ఐదుగురికి సేవా రత్న, ఏడాదిగా ఎటువంటి అంతరాయం లేకుండా పని చేస్తున్న వలంటీర్లకు సేవా మిత్ర అవార్డులు ప్రదానం చేస్తున్నట్టు తెలిపారు. పెనమలూరు నియోజకవర్గంలో పనిచేస్తున్న 1,500 మంది వలంటీర్లలో ఉత్తమ సేవలందించిన వలంటీర్లకు సీఎం చేతుల మీదగా అవార్డులిస్తామన్నారు. కార్యక్రమంలో సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, సీపీ బత్తిన శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘అమరావతిపై ప్రేమ ఉంటే ఉప ఎన్నికలకు వెళ్లాలి’
-
ఆ రూ.52 వేల కోట్లను ఎక్కడ ఖర్చు చేశారు?
సాక్షి, తాడేపల్లి : తన ఎమ్మెల్యేలు పోయినా పర్వాలేదు కానీ అమరావతిలో ఉన్న ఆస్తులే తనకు ముఖ్యమనే విధంగా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి విమర్శించారు. అమరావతిలో ఉద్యమాన్ని నడిపిస్తున్నవారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులని ఆరోపించారు. వాళ్లంతా అమరావతి మీద ప్రేమతో కాకుండా వ్యాపారం కోసం ఉద్యమాలు చేయిస్తున్నారని విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అన్ని ప్రాంతాల సమానాభివృద్ధే తమకు ముఖ్యమమని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. రూ.52 వేల కోట్లు ఖర్చు చేసినట్లు అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. ఆ 52 వేల కోట్ల రూపాలయను ఎక్కడ ఖర్చు చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. (చదవండి : 'ఏం చెప్పారో చంద్రబాబుకే తెలియదు') అద్భుతమైన రాజధాని నిర్మిస్తానంటూ అమరావతి రైతులను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. రాజధాని భూములను ఇష్టానుసారంగా తన బినామీలకు ధారాదత్తం చేశారని ధ్వజమెత్తారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధికి చెందినదని కేంద్ర స్పష్టం చేసినా.. టీడీపీ నేతలు బుద్ధిలేకుండా ఇంకా కేంద్రం జోక్య చేసుకోవాలని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మతి భ్రమించి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. అమరావతిపై చంద్రబాబుకు అంత ప్రేమ ఉంటే తమ ఎమ్మెల్యేలు, ఎంపీలను రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని పార్థసారథి సవాల్ విసిరారు. (చదవండి : ఉన్నత విద్యపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు) -
ఆయనకు భయం పట్టుకుంది అందుకే..!
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రాభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి తెలిపారు. శనివారం ఆయన తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... అమరావతి రైతులను గత టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాతే రైతులకు న్యాయం జరిగిందన్నారు. గత ప్రభుత్వం అవినీతి బయటకు వస్తుందని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే చంద్రబాబు, ఎల్లోమీడియా ఆరాటమని విమర్శించారు.(రాజధాని భూముల అవినీతిపై సిట్ ఏర్పాటు) అవినీతి బయటపెడితే బీసీల దాడి అంటున్నారని పార్థసారధి ధ్వజమెత్తారు. కేబినెట్లో ఐదుగురు డిప్యూటీ సీఎంలను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చారన్నారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు అవినీతి బయటకొచ్చిందన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులంతా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. అక్రమ సొమ్ము మొత్తం చంద్రబాబు వద్దకే చేరిందని ఆరోపించారు. చంద్రబాబు పాత్రపై కూడా సిట్ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని పార్థసారధి మండిపడ్డారు. (వికేంద్రీకరణతోనే ప్రగతి) -
పవన్‌కు ఆ విషయాలు తెలియదా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై టీడీపీ, జనసేన తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మండిపడ్డారు. రాజధాని రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను ఎల్లో మీడియా వక్రీకరించి తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానిని మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడైనా ప్రకటించారా? అని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన కలిసి రాజధానిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ మేరకు ‘గడిచిన ఐదేళ్లు చంద్రబాబు, పవన్ కళ్యాన్ కలిసి సంసారం చేశారు. అప్పుడు చంద్రబాబు అవినీతి పవన్‌కు కనిపించలేదా?. టీడీపీ పాలనను ఆయన సమర్థిస్తున్నారా?. ఐదేళ్లలల్లో ఒక్కసారైనా చంద్రబాబును పవన్ ప్రశ్నించారా?. కర్నూల్‌ను రాజధానిగా చేయాలని గతంలో పవన్ కళ్యాన్ కోరినది నిజం కాదా. రాజధానిలో జరిగిన అవినీతి గురించి పవన్‌కు తెలిసినా కూడా ఎందుకు ప్రశ్నించలేదు. లింగమనేని భూములను ఎందుకు భూసేకరణ కిందకు తీసుకోలేదు. ఇసుకను మింగింది టీడీపీ నేతలు కాదా?. ఇసుకను తక్కువ ధరకు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుంటే నిందలు వేస్తారా. ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా ఇసుకను సరఫరా చేస్తున్నాం. అసెంబ్లీలో ఫర్నీచర్ మాయంపై చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడరు? ’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. -
మహామహులు ఏలిన పెనమలూరు
సాక్షి, కృష్ణా : పెనమలూరు నియోజకవర్గం విలక్షణమైనది. జిల్లాలో అత్యధిక ఓటర్లు గల నియోజకవర్గాల్లో రెండోది. 2009లో చేపట్టిన నియోజకవర్గ పునర్విభజనలో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ రెండు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గంలో పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 41 గ్రామాలు, ఒక మున్సిపాలిటి, ఉయ్యూరు నగర పంచాయతీలు ఉన్నాయి. నియోజకవర్గం మొత్తం విస్తీర్ణం 68,208 ఎకరాలు. విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారికి ఇరువైపులా విస్తరించి ఉన్న నియోజకవర్గం. 41 గ్రామాలు, 1 మున్సిపాలిటీకి అన్నింటికీ రహదారి మార్గం, రవాణా సౌకర్యాలు ఉన్నాయి. నిత్యం విజయవాడ–మచిలీపట్నం, విజయవాడ–ఏలూరు, అవనిగడ్డ, గన్నవరం, గుడివాడ ప్రాంతాలకు రవాణా సదుపాయాలు ఉన్నాయి. నియోజకవర్గం మీదుగా ప్రధానంగా బందరు, రైవస్ కాలువలు, వాటికి అనుబంధ కాలువలు ప్రవహిస్తున్నాయి. కృష్ణానది ఏటిపాయ కూడా పెనమలూరు, కంకిపాడు మండలాల్లోని ఐదు గ్రామాల మీదుగా ప్రవహిస్తుంది. సాగునీరు వ్యవస్థ అం దుబాటులో ఉంది. ప్రధానంగా బోర్లు, కాలువ నీటిపై ఆధారపడి సాగు జరుగుతుంది. వ్యవసాయాధారిత గ్రామాలు ఎక్కువ. పెనమలూరు మండలం సెమీ అర్బన్ ప్రాంతం. పట్టణీకరణ వాతావరణం. ఉద్యోగులు, కార్మికులు ప్రధానంగా ఉన్నారు. రాజధా ని అమరావతి, విజయవాడకు కూతవేటు దూరంలోనే నియోజకవర్గ గ్రామాలు ఉన్నాయి. ప్రతి పనికీ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తుంటారు. మూడవ పర్యాయం.. 2009లో జరిగిన నియోజకవర్గ పునర్విభజనతో పెనమలూరు నియోజకవర్గం ఏర్పడింది. తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొలుసు పార్థసారథి, టీడీపీ అభ్యర్థి చలసాని వెంకటేశ్వరరావు (పండు)పై 177 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంత్రివర్గంలో స్థానం పొంది అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో పార్థసారథి ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్, వైఎస్సార్సీపీ అభ్యర్థి కుక్కల విద్యాసాగర్‌పై 31,448 మెజారిటీతో గెలుపొందారు. రద్దయిన కంకిపాడు, ఉయ్యూరు నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా రెండో అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న కంకిపాడు, ఉయ్యూరు నియోజకవర్గాలు పునర్విభజనతో రద్దయ్యాయి. పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాలతో పెనమలూరు నియోజకవర్గం ఏర్పాటైంది. గతంలో ఉయ్యూరు నియోజకవర్గంలో ఉన్న పమిడిముక్కల, తోట్లవల్లూరు పామర్రు నియోజకవర్గంలో కలిశాయి. విజయవాడ రూరల్, అర్బన్ డివిజన్లు మైలవరం, విజయవాడ పరిధిలోకి వెళ్లాయి. కంకిపాడు నియోజకవర్గంలో... తొలి రోజుల్లో ఇక్కడ కమ్యూనిష్టులదే ప్రభావం. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించాక కంకిపాడు టీడీపీకి పెట్టని కోట అయ్యింది. 13 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి ఐదు పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికైన నేత మాత్రం దేవినేని రాజశేఖర్ (నెహ్రూ). రాజకీయంగా కోనేరు రంగారావుకు విజయాన్ని అందించింది కూడా కంకిపాడు నియోజకవర్గమే. రద్దయిన ఉయ్యూరు నియోజకవర్గంలో సమరయోధుడు కాకాని వెంకటరత్నం మూడు సార్లుగెలిచారు. ఉయ్యూరుకు తలమానికం చక్కెర కర్మాగారం ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెక్కర కర్మాగారాల్లో ఉయ్యూరు కేసీపీ కర్మాగారం కూడా ఒకటి. కర్మాగారం పరిధిలో 20 మండలాల్లో 26 వేల ఎకరాల్లో చెరకు సాగు జరుగుతోంది. 16 వేల మంది రైతులు కర్మాగారంలో 700 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు మొత్తం జనాభా : 3,55,277 మొత్తం ఓటర్లు : 2,58,586 పురుషులు: 1,26,239 మహిళలు : 1,32,324 ఇతరులు : 23 -
చంద్రబాబు చుట్టూ మోసగాళ్లే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు చుట్టూ అంతా మోసగాళ్లే ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి అన్నారు. ఆయన గురువారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బాబు తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షంపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. ఈ ఐదేళ్లలో ఒక్క మంచి పని అయినా చేశామని చెప్పుకోలేక వైఎస్సార్సీపీపై అభాండాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏమీ చేయలేదు కాబట్టే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పార్థసారథి విమర్శించారు. మీడియా అండతో బాబు బతుకుతున్నాడు ‘‘హిందూజా సంస్థ జగన్మోహన్రెడ్డి పేరిట 11 ఎకరాల భూములను రిజిస్ట్రేషన్ చేసిందని అంటున్నారు. ఆ ఆరోపణలు నిజమని చంద్రబాబు నిరూపించగలరా? ఆ భూమి ఎక్కడ ఉందో చూపించాలి. అది అబద్ధం అయితే బాబు రాజకీయ సన్యాసం తీసుకుంటారా? దీనిపై 24 గంటల్లో సమాధానం చెప్పాలి. తొమ్మిదేళ్ల తర్వాత కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం చూస్తే చంద్రబాబు ఓటమి భయంతో మాట్లాడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈడీ, సీబీఐ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు చంద్రబాబు వద్దకు ఎలా చేరాయో చెప్పాలి. దానిపై విచారణ జరపాలి. ప్రతిపక్ష నేత జగన్‌పై అక్రమ కేసులు పెట్టడానికి, సంబంధం లేని కేసుల్లో ఇరికించడానికి, అవకాశం వస్తే విచారణలో కూడా వేలు పెట్టి ఇబ్బందులు సృష్టించడానికి చంద్రబాబు కుయుక్తులు పన్నారు. ఐదేళ్లపాటు దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసిన ముఖ్యమంత్రి తన పార్టీలో ఉన్న దొంగలను కాపాడుకుంటూ మీడియా సపోర్ట్‌తో బతుకుతున్నారు. మోసగాళ్లంతా టీడీపీలో చంద్రబాబు పక్కనే ఉన్నారు. గత కొద్దిరోజులుగా పత్రికల్లో వస్తున్న వార్తలు ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి. నామా నాగేశ్వరరావు మధుకాన్ సంస్థ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కంపెనీలు, రాయపాటి ట్రాన్స్ట్రాయ్ కంపెనీలు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన తీరు గురించి ప్రజలకు తెలుసు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ముడుపుల బాగోతం గురించి బయటపెడతానని రాయపాటి లాంటి వాళ్లు భయపెట్టే స్థాయికి వచ్చారంటే ఆ పార్టీ నేతలు ఎంతకు దిగజారారో అర్థం చేసుకోవచ్చు’’ అని కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీకి మద్దతు పలికితే నిరోధిస్తారా? ‘‘‘ఈ ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పుకోవాలో తెలియక జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు అబద్ధాలు, అసత్యాల ప్రచారానికి పూనుకున్నారు. తిరుమల మహాద్వారం ప్రవేశం విషయంలో హైందవ ధర్మాన్ని కాపాడే పీఠాధిపతులకు ప్రవేశం లేకుండా జీఓలు జారీ చేశారు. రాజకీయ నేతలు మహాద్వార ప్రవేశం చేయడంలో వివాదాలు లేవు గానీ, అనుకూలంగా లేరనో, బ్రాహ్మణులలో అత్యధికంగా వైఎస్సార్సీపీకి మద్దతు పలుకుతున్నారనో పీఠాధిపతులను నిరోధించేందుకు ఇలాంటి జీఓలు జారిచేయడం చంద్రబాబుకే చెల్లింది’’ అని పార్థసారథి మండిపడ్డారు. చంద్రబాబు విచారణకు సిద్ధమా? ‘‘మనోజ్ కొఠారి అనే చిన్నస్థాయి వైఎస్సార్సీపీ నేత బీజేపీ గురించి ఏదో మాట్లాడితే దాన్ని స్టింగ్ ఆపరేషన్ పేరిట తన అనుకూల పత్రికల్లో ప్రధానంగా ప్రచురింపజేసి దుష్ప్రచారం చేయాలనే స్థాయికి చంద్రబాబు దిగజారారు. చంద్రబాబు దోపిడీపై గతంలో కాంగ్రెస్ పార్టీ పుస్తకాలను ప్రచురించింది. వైఎస్సార్సీపీ కూడా సాక్ష్యాలు, జీఓలతో సహా చంద్రబాబు రూ.6 లక్షల కోట్ల దోపిడీపై పుస్తకాన్ని ప్రచురించింది. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై చంద్రబాబు సీబీఐ విచారణ జరిపించుకోవాలి. నిజాయతీపరుడిగా బయటకు రాగలిగే దమ్ము ఉంటే విచారణకు సిద్ధం ఉండాలి’’ అని కొలుసు పార్థసారథి డిమాండ్ చేశారు. -
‘భయాన్ని సృష్టించి నానా యాగీ చేస్తున్నారు’
హైదరాబాద్: కాపీ కొట్టడంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నారని, కాపీ కొట్టడంలో ఆయనను మించిన వారు లేరని వైఎస్సార్సీపీ నేత కొలుసు పార్థసారధి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్థసారధి విలేకరులతో మాట్లాడారు. రైతులను నాలుగేళ్లు పట్టించుకోలేదు.. ఎన్నికలకు ముందు పండుగ అంటూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని బాబుపై మండిపడ్డారు. ఒక్క పంటకు కూడా టీడీపీ ప్రభుత్వం కనీస మద్ధతు ధర ఇవ్వలేదని చెప్పారు. ధరల స్థిరీకరణ నిధిని ఖర్చు చేయలేని అసమర్థ సీఎం చంద్రబాబు అని తూర్పారబట్టారు. రైతులు న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తే వాళ్లను జైళ్లలో పెట్టించారని, టీడీపీ నాయకులు భయాన్ని సృష్టించి నానా యాగీ చేస్తున్నారని అన్నారు. తిథిలీ తుపానుతో రూ.3600 కోట్లు నష్టం వాటిల్లిందని ప్రభుత్వమే చెప్పింది..కానీ వారిని ప్రభుత్వమే ఆదుకోలేదని గుర్తు చేశారు. ఒక పక్క పెథాయ్ తుపాను ప్రభావంతో రాష్ట్రం అల్లాడుతుంటే.. రాజకీయాలు చేయడానికి పరాయి రాష్ట్రంలో చంద్రబాబు పర్యటించారని తీవ్రంగా దుయ్యబట్టారు. చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్నారని, నాలుగేళ్లు ఒక రంగు.. ఎన్నికల ఏడాది మరో రంగుతో కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భయపడి ప్రత్యేక హోదాపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే.. అప్పుడే ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై కేసులు రద్దు చేసేవారని అన్నారు. వ్యవసాయ రుణాలు అన్నీ రద్దు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రుణమాఫీకి రూ.24 వేల కోట్లు ఇస్తామని చెప్పి... రూ.14 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. రైతులకు కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.10 వేలు ఇస్తామని మరో నాటకానికి చంద్రబాబు తెరలేపారని విమర్శించారు. అసెంబ్లీలో తప్పుడు లెక్కలు చూపెట్టారని, బడ్జెట్లో అన్నదాత సుఖీభవకు నిధులే కేటాయించలేదని తెలిపారు. చంద్రబాబు, సీఎం కుర్చీ కోసమే మోసపూరిత హామీలు ఇస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రకటించిన 2 సంవత్సరాల తర్వాత పింఛన్ 2 వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. బాబుకు దమ్ముంటే ఇళ్ల పట్టాలు ఎన్ని ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఇళ్ల పట్టాలకు ఎన్ని ఎకరాల భూమి సేకరించారో బయటపెట్టలన్నారు. గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు తీసుకుని మళ్లీ పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 17న ఏలూరులో జరగబోయే బీసీ గర్జన గురించి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌తో చర్చించినట్లు తెలిపారు. బీసీలకు నామినేటెడ్ పదవులు: జంగా ఈ నెల 17న ఏలూరులో బీసీ గర్జన సభ జరగనుందని వైఎస్సార్సీపీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి తెలిపారు. బీసీ డిక్లరేషన్ విషయంలో బీసీ నేతల సూచనలు వైఎస్ జగన్ తీసుకుంటారని తెలిపారు. ప్రతీ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బీసీ సబ్‌ప్లాన్‌పై వైఎస్ జగన్‌తో కూలంకశంగా చర్చించినట్లు తెలిపారు. నామినేటెడ్ పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చేలా.. దానికి చట్టబద్ధత తీసుకుని వచ్చేలా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. బీసీలలో పారిశ్రామిక అభివృద్ధి కోసం చర్చించామని, బీసీ గర్జన బీసీలకు దశ, దిశ నిర్ధేశంగా మారనుందని వ్యాఖ్యానించారు. -
‘నాలుగేళ్లు కేంద్రంలో ఏ చక్రం తిప్పారు బాబూ’
హైదరాబాద్: ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిలో భయం పెరుగుతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్ధసారధి విలేకరులతో మాట్లాడుతూ..శ్వేత పత్రం పేరుతో ప్రజలకు ఏమీ అర్ధం కాకుండా ఏవేవో విడుదల చేస్తున్నారని మండిపడ్డారు. తన తప్పులు , చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి అర్ధంకాని శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారని ధ్వజమెత్తారు. తానే అందరికంటే సీనియర్‌ననే మానసిక రోగం చంద్రబాబుకు ఉందనే అనుమానం కలుగుతోందన్నారు. ఎకానమీ అంతా తనకే తెలుసు అని మాట్లాడుతున్న చంద్రబాబును ప్రజలు ఏవిధంగా అర్ధం చేసుకోవాలన్నారు. జీతాలకు కూడా ఆర్బీఐ దగ్గర ఓడీ తీసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన అర్ధశాస్త్ర ప్రావీణ్యంతో ఆంధ్రరాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టారని దుయ్యబట్టారు. సహజవనరులను దోచుకుని తెలుగు తమ్ముళ్ల సంపద పెంచారని తీవ్రంగా విమర్శించారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతా అన్న చంద్రబాబు 4 ఏళ్లలో ఏ చక్రం తిప్పారని సూటిగా ప్రశ్నించారు. ఆనాడు కేంద్రాన్ని ఎందుకు పొగిడారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అలాగే చంద్రబాబుకు దేంట్లో అనుభవం ఉందో చెప్పాలన్నారు. పంటలకు కనీస మద్ధతు ధర కూడా ఇవ్వలేదు..రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందని ఎలా చెప్పగలుగుతున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్ హయాంలో ప్రతీ రైతుకు రుణమాఫీ జరిగిందని, చంద్రబాబు హయాంలో రుణమాఫీ కానివారి సంఖ్యే ఎక్కువగా ఉందని చెప్పారు. ఎన్టీఆర్ తెచ్చిన రెండు రూపాయల కిలో బియ్యాన్ని రూ.5.50లకు పెంచిన ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? అన్నచంద్రబాబు.. సోషియాలజీ గురించి మాట్లాడటమేంటని సూటిగా అడిగారు. చంద్రబాబు సంక్షేమ పథకాల గురించి మాట్లాడటం అతిశయోక్తిగా ఉందన్నారు. ఎన్నికల్లో ప్రజలకు సమాధానం చెప్పలేక శ్వేత పత్రం పేరుతో నాటకాలు ఆడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. ఆరోగ్య శ్రీని అటకెక్కించి,లక్షన్నర మందికి మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేసి, ఏదో సాధించానని బాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు తన పాలన, పథకాలతో ప్రజల్లోకి వెళ్లలేక పిరికి పందలా జగన్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం వస్తేనే వృద్ధులు ఆత్మగౌరవంతో బతకగలుగుతారని అన్నారు. -
అధికారులు సీఎంలా నిర్లక్ష్యంగా ఉండొద్దు : పార్ధసారధి
సాక్షి, విజయవాడ : పెథాయ్ తుపాన్ నేపథ్యంలో రాష్ట్రంలో అత్యధిక జిల్లాల్లో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాల్లో కోతలు పూర్తి కాలేదని, కుప్పలు కూడా వేసిన పరిస్థితిలేదన్నారు. రైతులు తీవ్ర ఆందోళన ఉన్నారని తెలిపారు. ఈ పరిస్థితులలో రైతులకు ఆసరాగా ఉండాల్సిన సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని గాలికొదిలేసి రాజకీయక్రీడలు ఆడుతున్నారని మండిపడ్డారు. విజయవాడ పార్టీ కార్యలయంలో పార్ధసారధి మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో క్షుద్రపాలన జరుగుతోంది. రాజకీయాలు, ఇతర పార్టీలతో సంబంధాలు అనేవే చంద్రబాబుకు ప్రథమ ప్రాధాన్యతగా కనిపిస్తోంది. క్షుద్రపూజలు అర్ధరాత్రి పూట జరుగుతుంటాయి. చంద్రబాబు కూడా ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు ఇచ్చేసి తుపానుపై అర్ధరాత్రి సమీక్షలు చేస్తున్నారు. పెథాయ్ తీవ్రతను బట్టి ప్రభుత్వం అత్యవసర పరిస్దితిని ప్రకటించింది. అధికారులందరికి ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. ఆర్టీసి, రైల్వేల సర్వీసులు రద్దు చేశారు. స్కూళ్లకు సైతం సెలవులు ఇచ్చారు. 24 గంటలు పరిస్థితిని సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన చంద్రబాబు వేరే రాష్ట్రాల సీఎంల ప్రమాణస్వీకారానికి వెళ్లారు. తుపాను వచ్చే సమయంలోనే సీఎం పనిచేయరు. తుపాను వచ్చాక అధికారులను పనిచేయనివ్వరు. తుపాను సహాయక చర్యల సమయంలో చంద్రబాబు మందిమార్భలంతో వచ్చి అధికారుల పనులకు అడ్డుతగులుతుంటారు. నేడు వేరే రాష్ట్రాలలో ఉన్న చంద్రబాబు రేపు వచ్చి హడావుడి చేస్తారు. మరో రెండు రోజులు అయ్యాక కేంద్రం డబ్బులు ఇవ్వడంలేదు అంటూ ప్రచారం స్టార్ట్ చేస్తారు. తర్వాత హుద్ హుద్ సమయంలో లాగానే పెథాయ్‌ను కూడా చంద్రబాబు జయించేశాడంటారు. ఈరోజు ముఖ్యమంత్రిగానీ, మంత్రులు గానీ ఎవ్వరూ అందుబాటులో లేరు. సొంతపనులపై వెళ్లారని తెలిసింది. రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అధికారులందరూ కూడా ముఖ్యమంత్రిలా నిర్లక్ష్యంగా ఉండొద్దు. రిపోర్ట్‌ల కోసం గణాంకాలకోసం పనిచేయొద్దు. రైతులకు భరోసా కల్పించండి. నష్టతీవ్రతను తగ్గించే చర్యలు చేపట్టాలి. ప్రకృతి వైపరిత్యాల సమయంలో గతంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని సకాలంలో అందించడం లేదు. ఇవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుని రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. వైఎస్సార్సీపీ రైతులకు అండగా ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలను విహారయాత్రలకు తీసుకువెళ్తున్నారు. పోలవరం పూర్తవ్వాలంటే మూడు నాలుగేళ్లు పడుతుందని అక్కడికి వెళ్లిన వారందరూ చెబుతున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం అనుమతులు సాధించారు. కాలువలు తవ్వించారు. ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించేలా చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌లో చంద్రబాబు పాత్ర సున్నా. కేవలం ముడుపుల కోసమే ఇది చేపట్టారు. తాము నీళ్లిస్తామంటూ వైఎస్ జగన్‌ను ఉద్దేశించి మంత్రి దేవినేని చాలాసార్లు చెప్పారు, అవన్నీ కల్లబొల్లి మాటలుగా తేలిపోయాయి. అలా నీరు ఇవ్వలేరని తేలిపోయింది. ఏదైనా ఒక వస్తువును ఎక్కువ ధర పెట్టి కొంటే దానిలో స్పెషాలిటి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయం కూడా చదరపు అడుగుకు రూ. 11, 666 వెచ్చించి కట్టారు. అందుకే వర్షం వచ్చినపుడల్లా లీకవుతుంటుంది. అదేదాని స్పెషాలిటీ. దీనిని బట్టి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్ట్‌ల పరిస్థితి ఇలాగే ఉంటుందని అర్థమవుతోంది' అని తెలిపారు. -
‘సూర్యాస్తమయ రాష్ట్రంగా మార్చారు’
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు 1500 రోజుల పాలనలో అవినీతి, అన్యాయం, అరాచకం తప్ప అభివృద్ధి కనిపించడంలేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. 1500 రోజుల పాలనపై చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిందని, రాష్ట్రం మాత్రం అవినీతిలో కూరకుపోయిందని విమర్శించారు. ‘చంద్రబాబు సీఎంగా ఉంటే ఆంధ్రరాష్ట్రం అన్నపూర్ణగా ఎప్పటికీ కాలేదు. సూర్యోదయ రాష్ట్రం కాదు సూర్యాస్తమయ రాష్ట్రంగా మార్చారు. మీకు దమ్ముంటే 1500 రోజుల పాలనపై ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమా? నాలుగేళ్ల పాలనలో అభూత కల్పనలు, అబద్ధాలు ప్రచారం చేశారు. కేంద్రంతో లాలూచీ పడి ముడుపులు తీసుకున్నారు. చంద్రబాబు ప్రజల ముందు దొంగ దీక్షలు చేస్తున్నారు. దొంగ దీక్షలు చంద్రబాబు నైజాం. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తన స్వార్థం కోసం, ముడుపుల కోసం కేంద్రం నుంచి బలవంతంగా తీసుకున్నారు. డ్వాక్రా మహిళలకు వడ్డీకి కూడా చాలని డబ్బులిచ్చి రుణమాఫీ అంటున్నారు’ అని పార్థసారథి మండిపడ్డారు. బలహీన వర్గాలకు రూ. 750 కోట్లు మాత్రమే ఇచ్చి గొప్పగా చెప్పుకోవడానికి సిగ్గలేదా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. ‘ప్రజలు నిన్ను తుంగలో తొక్కే అవకాశం కోసం చూస్తున్నారు. ప్రజల దృష్టిని మరల్చడం కోసమే వైఎస్సార్సీపీ జపం చేస్తున్నారు. చంద్రబాబుకు ఛాలెంజ్ చేస్తున్నా.. బీజేపీతో వైఎస్సార్సీపీ పొత్తు పెట్టుకుంటే నేను నా కుంటుంబం రాజకీయాల నుంచి తప్పుకుంటాం. జగన్ మోహన్ రెడ్డి మాటపై మాకు నమ్మకం ఉంది. టీడీపీ నేతలకు చంద్రబాబుపై నమ్మకం ఉందా?’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
బాబు సీనియారిటీ ఏమైంది
-
బాబు సీనియారిటీ ఏమైంది: పార్థసారధి
విజయవాడ: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు సీఎం చంద్ర బాబు నాయుడు ఏమీ సాధించలేకపోయారని, ఆయన సీనియారిటీ ఏంటో రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు బాగా అర్ధమైందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిథి కొలుసు పార్థసారథి విమర్శించారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లుగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. పదేపదే విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగిందని చంద్రబాబు చెబుతున్నారని..కానీ అటు వరంగల్, హైదరాబాద్‌కు వెళ్లినపుడు మాత్రం తన వల్లే తెలంగాణా వచ్చిందని చంద్రబాబు చెప్పలేదా అని ప్రశ్నించారు. కేంద్రంతో తమ సంబంధాలు బాగున్నాయని ఇప్పటి వరకు చంద్రబాబు చెప్పుకుంటూ వచ్చారని..అంటే ఈ ఏడాదే కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందా? అని సూటిగా అడిగారు. నాలుగేళ్లుగా ఎన్డీఎలో భాగస్వామిగా ఉండి చంద్రబాబు ఏం సాధించారని అన్నారు. బడ్జెట్ పై చంద్రబాబు డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతోదని నాలుగేళ్లుగా వైఎస్ఆర్సీపీ పోరాటాలు చేస్తోందని, ప్రతిసారీ పోలీసులతో కేసులు పెట్టారని గుర్తు చేశారు. మా పోరాటంను చూపి, కేంద్రంపై ఎందుకు చంద్రబాబు సర్కారు వత్తిడి చేయలేదని ప్రశ్నించారు. 24 సార్లు సీఎం ఢిల్లీ వెళ్లారని టీడీపీ నేతలు చెబుతున్నారని, తనపై వున్న కేసుల కోసమే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని ఇప్పుడు అర్ధమవుతోందని విమర్శించారు. ప్రతిపక్షంగా తాము చెప్పింది ఏనాడూ చంద్రబాబు పట్టించుకోలేదని, రాష్ట్రం అన్యాయమై పోతోందని తాము అనేక సార్లు ఆందోళన నిర్వహించామని చెప్పారు. విభజన హామీలపై చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరంను తామే కడతామని చంద్రబాబు ఎందుకు తీసుకున్నారని అడిగారు. ఈ నాలుగేళ్లలో అరకొర నిధులు ఇస్తున్నా..కేంద్రం ను చంద్రబాబు సర్కార్ ఎందుకు అడగలేదన్నారు. రైల్వే జోన్ సంగతేంటని ప్రశ్నించారు. -
కాలువ గండిపై విచారణ జరిపించాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి సీతారామపురం(నూజివీడు) : పోలవరం కుడి కాలువకు పడిన గండి విషయంలో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. పోలవరం కుడి కాలువ అండర్‌టన్నెల్‌కు గండి పడిన ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు. కాలువ ఎస్ఈ వై.శ్రీనివాసయాదవ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్థసారథి మాట్లాడుతూ జల వనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, వాస్తవాన్ని వదిలేసి విద్రోహులు చేశారంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గండి పడి ఆరురోజులవుతున్నా ఇప్పటి వరకు శాఖాపరమైన విచారణ చేయించకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. విద్రోహుల పనే అయితే ఈ గండి ద్వారా నీళ్లు ఎక్కడికి వెళ్లాయి, ఎవరికి లబ్ధిచేకూరిందనే దానినైనా గుర్తించారా అని ప్రశ్నించారు. నీళ్లతో రెండు వేల ఎకరాల్లోని చేపల చెరువులను నింపుకున్నారని, దీనిని ఎందుకు గుర్తించడం లేదని నిలదీశారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాలువకు గండి పడినప్పుడు ప్రాథమిక నివేదికను అధికారులు ఇవ్వాలని, ఇది ఎవరి వైఫల్యమో తేల్చి చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఇంత వరకు ప్రభుత్వం ఈ గండి పై నోరుమెదపక పోవడాన్ని బట్టే దీని వెనుక ఎవరున్నారో అర్థమవుతోందన్నారు. ప్రజలసొమ్ము అంటే ప్రభుత్వానికి బాధ్యత లేకుండా పోయిందని, ఇష్టారాజ్యంగా దోపిడీ జరుగుతోందని ధ్వజమెత్తారు. పార్థసారథి వెంట గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త దుట్టా రామచంద్రరావు, బాపులపాడు జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, వైఎస్సార్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి కోడెబోయిన బాబి, జిల్లా కార్యదర్శి నక్కా గాంధీ, ఎంపీటీసీలు బేతాల ప్రమీలారాణి, కొనకళ్ల వెంకటేశ్వరరావు ఉన్నారు. యుద్ధప్రాతిపదికన పనులు పోలవరం కుడికాలువపై రామిలేరుపై ఉన్న యూటీకి పడిన గండిని పూడ్చేందుకు గాను యుద్ధప్రాతిపదికన పనులు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గండి పూడ్చివేత పనులను శనివారం పరిశీలించారు. అండర్‌టన్నెల్ స్లాబ్‌ను ఆనుకుని చేస్తున్న ఆఫ్రాన్ త్వరితగతిన పూర్తిచేయాలని ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ రమేష్‌బాబులను ఆదేశించారు. పనులన్నీ పూర్తయిన తరువాత మరల పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేసి కృష్ణాడెల్టాకు గోదావరి జలాలను అందించనున్నట్లు చెప్పారు. ఉమాతో పాటు పోలవరం కాలువ ఎస్ఈ వై.శ్రీనివాస్ యాదవ్, జల వనరులశాఖ ఎపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ల గోపాలకృష్ణ, కృష్ణా తూర్పుడెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ ఉన్నారు.