కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సీఎం చంద్ర బాబు నాయుడు ఏమీ సాధించలేకపోయారని, ఆయన సీనియారిటీ ఏంటో రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు బాగా అర్ధమైందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిథి కొలుసు పార్థసారథి విమర్శించారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లుగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. పదేపదే విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగిందని చంద్రబాబు చెబుతున్నారని..కానీ అటు వరంగల్, హైదరాబాద్‌కు వెళ్లినపుడు మాత్రం తన వల్లే తెలంగాణా వచ్చిందని చంద్రబాబు చెప్పలేదా అని ప్రశ్నించారు