
సాక్షి, పెనమలూరు : అమెరికాలో నివసిస్తున్న కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన ప్రవాసాంధ్రులు వివిధ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విజయవాడ సమీపంలో ఉన్న పెనమలూరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో ఆగ్రామానికి చెందిన ప్రవాసాంధ్రులు ముందుకువచ్చారు. పెనమలూరులో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను లక్షలాది రూపాయల ఖర్చుతో అభివృద్ధి చేశారు. నూతన భవనాల నిర్మాణంతో పాటు సోలార్ విద్యుత్ సౌకర్యం, డిజిటల్ తరగతి గది తదితర ఏర్పాట్లు చేశారు.
ఆ గ్రామంలో ఎవరికీ ఆపద వచ్చినా మేమున్నాం అంటూ వారిని ఆదుకుంటున్నారు. ఇటీవల గ్రామానికి చెందిన షేక్ శంషాద్ అనే యువకుడు షామియానా దుకాణం నడుపుతున్నారు. ఆకస్మికంగా శంషాద్ మృతి
చెందడంతో అతని భార్యా పిల్లలు అనాథలుగా మారారు. ఈ విషయాన్నీ తెలుసుకున్న పెనమలూరు ప్రవాసులు ఆ కుటుంబానికి రెండు లక్షలు ఆర్థిక సహాయాన్ని అందించారు. స్థానిక ఆంధ్రా బ్యాంకులో డిపాజిట్ చేసి వచ్చిన వడ్డీతో పిల్లలు చదువుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆంధ్రా బ్యాంకు మేనేజరుతోపాటు ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment