
వైఎస్సార్ సీపీ రాష్ర్ట మహిళా ప్రధాన కార్యదర్శిగా తాతినేని
పెనమలూరు : వైఎస్సార్ సీపీ ఏపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ప్రకటించారు. పెనమలూరు గ్రామానికి చెందిన పద్మావతి 1995 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా, జెడ్పీ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. వైఎస్సార్ సీపీ ప్రారంభం నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆమె పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. ప్రస్తుతం తోట్లవల్లూరు జెడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన పద్మావతి జిల్లా పరిషత్‌లో వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు.