
పార్థసారథికి అదనపు బాధ్యతలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథికి ఆ పార్టీ అదనపు బాధ్యతలు అప్పగించింది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్థసారథిని పెనమలూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇప్పటికే జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న పార్థసారథి అధ్యక్ష బాధ్యతలతోపాటు పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పూర్తి స్థాయిలో పని చేస్తారు. ఆయన నేతృత్వంలోనే నియోజకవర్గంలోని పార్టీ కార్యక్రమాలన్ని జరుగుతాయని ఆ ప్రకటనలో వివరించింది.