Pardhasarathi
-
దౌర్జన్య భూమి
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న జన్మభూమి–మావూరు గ్రామసభల్లో సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రజలు, ప్రతిపక్షం వైఎస్సార్సీపీ నాయకులపై అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. గురువారం కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు 17వ వార్డులో జరిగిన సభకు వైఎస్సార్సీపీ నేత కొలుసు పార్థసారథి హాజరై ఎన్నికల హామీలు అమలుకు నోచుకోలేవని, జీ+3 ఇళ్ల నిర్మాణాల్లో భారీ కుంభకోణం చోటుచేసుకుందని ఆరోపించారు. దీనిపై ఆవేశంతో ఊగిపోయిన పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తిట్ల పురాణం అందుకున్నారు. అదే అదనుగా టీడీపీ నాయకులు బరితెగించి దౌర్జన్యానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు సైతం ఎమ్మెల్యేకు వంతపాడారు. పార్థసారథిని బలవంతంగా సభ నుంచి బయటకు పంపేశారు. కాగా, యనమలకుదురు సభలో బోడే ప్రసాద్ మాట్లాడుతూ బిల్డర్లు గ్రామంలో గ్రూప్‌హౌస్‌ల నిర్మాణాలు చేస్తుండటంతో వారిని బెదిరించి రూ.కోటి వసూలు చేశానని, ఆ సొమ్ముతో రోడ్లు వేశానని చెప్పడం గమనార్హం. విజయవాడ సెంట్రల్ 59వ డివిజన్ పరిధిలో జరిగిన గ్రామసభలో గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం చూపలేదంటూ అఖిలపక్షం నాయకులు ఎమ్మెల్యే బొండా ఉమా, అధికారులను నిలదీశారు. వారిపై పోలీసులు విరుచుకుపడ్డారు. కార్పొరేటర్ అవుతు శైలజపై టీడీపీ కార్యకర్త దాడికి యత్నించాడు. శ్రీకాకుళం జిల్లా భామిని మండలం బత్తిలి సభలో సంక్షేమ పథకాలు అర్హులకు ఇవ్వలేదని వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిలదీయగా.. అడ్డుపడిన టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో గ్రామసభను వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడంతో టీడీపీ మండలాధ్యక్షుడు బవిరిశెట్టి రాంబాబు వర్గీయులు కుర్చీలు, బల్లలతో దాడి చేశారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులకు గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరులో స్థానిక సమస్యలు పరిష్కరించట్లేదంటూ ఓ యువకుడు అధికారపార్టీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును నిలదీయగా.. పక్కనే ఉన్న పోలీసులు కలుగజేసుకుని నువ్వు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడివి.. సభలో గందరగోళం సృష్టించడానికి వచ్చావంటూ పక్కకు లాగేశారు. సీఎం చంద్రబాబు నివాసముంటున్న ఉండవల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో స్థానిక సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసేందుకొచ్చిన ప్రజల్ని అధికారపార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వారికి, ప్రజలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కిర్తుబర్తిలో అర్హులకు పింఛన్లు అందలేదని, సంక్షేమ పథకాలు కొంతమందికే అందజేస్తున్నారంటూ గ్రామస్తులు ఎమ్మెల్యే కె.ఎ.నాయుడును నిలదీశారు. మెరకముడిదాం మండలం చినబంటుపల్లిలో గ్రామ సమస్యలపైన, ఆంధ్రా పెర్రో అల్లాయిస్ పరిశ్రమలో కార్మికుల సమస్యలపైన ఎమ్మెల్యే కిమిడి మృణాళిని, జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణిని అక్కడి ఉద్యోగులు నిలదీశారు. వేపాడ మండలం పి.కె.ఆర్.పురంలో హామీలు నెరవేర్చలేనప్పుడు గ్రామసభలొద్దంటూ గ్రామస్తులు అధికారులు ఊళ్లోకి రాకుండా ట్రాక్టరు, ఆటో, ముళ్లకంచెలు వేసి అడ్డుకున్నారు.కర్నూలు జిల్లా పడిదెంపాడు, పూడూరుల్లో రోడ్డు సమస్య పరిష్కరించాలంటూ అధికారులను గ్రామాల్లోకి రాకుండా రోడ్డుపై టైర్లు వేసి నిప్పంటించారు. ‘జన్మభూమి’ ఒత్తిడితో ఏఎస్ఐకి ఛాతీనొప్పి.. మృతి కృష్ణా జిల్లా వీరులపాడు మండలం బొడవాడలో 20 ఏళ్లుగా నివాస స్థలాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఇంకా ఎన్నిసార్లు అర్జీలివ్వాలని డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రాజును ప్రశ్నించిన వారిపై పోలీసుల్ని ఉసిగొల్పారు. దీంతో ఆందోళనకు దిగిన వారిని అదుపు చేయడానికి ప్రయత్నించిన ఏఎస్ఐ మహబూబ్ బాషా ఒత్తిడికి లోనయ్యారు. విధులు ముగించుకుని వెళుతున్న సమయంలో ఛాతీనొప్పి రావడంతో మృతిచెందారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కరవంజ గ్రామసభకు హాజరైన అడపా సత్యవతమ్మ అనే మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. మధ్యాహ్నం అధికారులు మాట్లాడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. -
యుద్ధప్రాతిపదికన ‘కత్తెర’ నివారణ చర్యలు
సాక్షి, హైదరాబాద్: మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘కత్తెర కాటు’శీర్షికన ఈ నెల 18న ‘సాక్షి’ప్రచురించిన కథనంపై జిల్లా వ్యవసాయాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతకొద్ది రోజులుగా రాష్ట్రంలో మొక్కజొన్నకు కత్తెర పురుగు సోకినట్లు నివేదికలు వచ్చాయన్నారు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేసి రైతుల్లో అవగాహన తీసుకురావాలని సూచించారు. కిందిస్థాయిలో రైతులను సమన్వయం చేసుకుని కత్తెర పురుగు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. కత్తెర పురుగును మన దేశంలో మొదట కర్ణాటకలో గుర్తించారని, ఇప్పుడు వేగంగా నాలుగు రాష్ట్రాలకు వ్యాపించిందని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పి.పార్థసారథి వివరించారు. మొదట మొక్కజొన్నపై ఆశించినా తదుపరి దశలో ఇతర అన్ని రకాల పంటలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని నివారణకు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల సహకారంతో ఐకార్ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి, శాంపిళ్లను సేకరించి బెంగళూరులోని పరిశోధన శాలలకు పంపించినట్లు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ వి.ప్రవీణ్‌రావు తెలిపారు. దీని నివారణకు ఇయోమెట్ బెంజైట్ను లీటరుకు 0.4 గ్రాముల చొప్పున ఎకరాకు 80 గ్రాములను సాయంత్రం వేళలో పిచికారి చేయాలని సూచించారు. వరదల వల్ల పలుచోట్ల నష్టం.. ఇప్పటివరకు రాష్ట్రంలో 26.52 లక్షల మంది రైతులకు చెందిన రైతు బీమా బాండ్ల ముద్రణ, పంపిణీ జరిగిందని మంత్రి పోచారం తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 135 మంది రైతుల మరణాలు నమోదు కాగా, 110 మంది వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేశారన్నారు. వారిలో 107 మంది రైతుల వివరాలను ఎల్ఐసీకి పంపగా 75 మంది నామినీ ఖాతాల్లోకి బీమా కవరేజీ రూ.5 లక్షల చొప్పున జమ చేసినట్లు తెలిపారు. ఈ నెల చివరి వరకు వరి పంటకు బీమా గడువు ఉందన్నారు. రాష్ట్రంలో వర్షాకాలం సాగు 86 శాతానికి చేరుకుందని పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో అధిక వర్షాలతో కొంత పంట నష్టం సంభవించినట్లు తెలిసిందన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో వివరాలను సేకరించి తక్షణమే బీమా కంపెనీలకు సమాచారం పంపించాలన్నారు. -
విత్తనోత్పత్తిలో సహాయం చేయండి
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన విత్తనోత్పత్తి, విత్తన నిల్వలో సాంకేతిక పరిజ్ఞానంపై సహకారం అందించాలని వియత్నాం దేశ జాతీయ అసెంబ్లీ ప్రతినిధుల బృందం రాష్ట్రాన్ని కోరింది. 4 రోజుల పర్యటనలో భాగంగా సోమవారం హైదరాబాద్ చేరుకున్న వియత్నాం ఉన్నతాధికారుల బృందం రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథితో సమావేశమైంది. వ్యవసాయాభివృద్ధి, పరిశ్రమలు, వ్యాపారం, విత్తన శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను అన్వేషించి అందిపుచ్చుకోవటానికి తెలంగాణ పర్యటనకు వచ్చినట్లు 10 మంది సభ్యుల బృందానికి నాయకత్వం వహిస్తున్న గుయెన్ తి యెన్ తెలిపారు. తమ దేశంలో గాలిలో అధిక తేమ వల్ల విత్తన నిల్వ సమస్యగా ఉందన్నారు. విత్తన పంటల కోత అనంతరం విత్తన నాణ్యతా పరిరక్షణ, విత్తన నిల్వలపై శిక్షణ అందించాలని కోరారు. భారతదేశానికి తెలంగాణ విత్తన రాజధానిగా ఉండటం గర్వకారణమన్నారు. ప్రస్తుతం తాము విత్తనాన్ని అమెరికా, ఐరోపా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. నాణ్యమైన విత్తనోత్పత్తికి తెలంగాణ ప్రసిద్ధి అని తెలుసుకొని ఒప్పందాలు చేసుకోవటానికి రాష్ట్రానికి వచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. ఈజిప్ట్, ఫిలిప్పీన్స్, రష్యా, ఇటలీ తదితర 20 దేశాలకుపైగా విత్తనాలను ఎగుమతి చేస్తున్నామన్నారు. వియత్నాం సహా ప్రపంచ దేశాలకు కావాల్సిన అన్ని రకాల నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేసి ఎగుమతికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. వియత్నాంకు అన్ని విధాలా శాస్త్ర, సాంకేతిక సహకారం అందిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 3 వరకు హైదరాబాద్‌లో నిర్వహించే 32వ ఇస్టా సదస్సుకు రావాలని వియత్నాం బృందాన్ని ఆయన ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ సంచాలకుడు డాక్టర్ కేశవులు, సుదర్శన్, రవీందర్ రెడ్డి, భాస్కర్ సింగ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల ఆగ్రహం బాబు చవిచూడక తప్పదు
విజయవాడ: టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రిజర్వేషన్ విద్యార్థులు నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే సరిదిద్దకపోతే బీసీ విద్యార్థుల ఆగ్రహం చవిచూడక తప్పదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి హెచ్చరించారు. మంగళవారం విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్ధసారథి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ అధికారులు ప్రవర్తిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల బలహీన వర్గాలకు చెందిన వందలాది విద్యార్థులు మెడికల్ సీట్లు కోల్పోయారని వ్యాఖ్యానించారు. బలహీన వర్గాలకు టీడీపీ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోందని విమర్శించారు. గత సంవత్సరం వరకు కూడా రీజియన్‌ను ఒక యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు నిర్ణయించి ఆయా కేటగిరీ విద్యార్థులకు సీట్లు కేటాయించేవారని తెలిపారు. మనకు ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అనే రెండు రీజియన్లు ఉన్నాయని, వాటి పరిధిలో 1500ల మెడికల్ సీట్లు ఉన్నాయని వివరించారు. రిజర్వేషన్ కోటా ప్రకారం బీసీ-డీకి 7 శాతం, బీసీ-సీకి ఒక శాతం సీట్లు రిజర్వు చేయటం జరిగిందని, ఈ లెక్క ప్రకారం రెండు కేటగిరీలలోని బీసీ విద్యార్థులకు 120 సీట్లు రావాలని అన్నారు. కానీ 10 సీట్లు మాత్రమే వచ్చాయని..దీనికి కారణం కాలేజీని యూనిట్‌గా తీసుకోవడమేనని చెప్పారు. ఓపెన్ కేటగిరీలో సీట్లు సంపాదించిన బీసీ విద్యార్థులను కూడా రిజర్వేషన్ కింద పరిగణించడం వల్లే బీసీ విద్యార్థులు నష్టపోయారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులను పురమాయించి తప్పును దిద్దాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
నిర్లక్ష్య వైఖరి వల్ల రిజర్వేషన్ విద్యార్థులు నష్టపోతున్నారు
-
పంట చేనుకే ‘ఎత్తిపోతలు’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనే తొలిసారిగా ఎత్తిపోతల ప్రాజెక్టుతో సూక్ష్మసేద్యాన్ని అనుసంధానం చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో విజయవంతంగా అమలవుతున్న ఈ భారీ అనుసంధాన కార్యక్రమాన్ని తెలంగాణలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని యోచిస్తున్నట్లు వ్యవసాయ వర్గాలు తెలిపాయి. ఖమ్మం జిల్లా పాలేరులోని సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎత్తిపోతల పరిధిలోని ఏదైనా ఓ గ్రామంలో వెయ్యి ఎకరాలను అనుసంధాన ప్రాజెక్టు పరిధిలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. వరి కాకుండా ఇతరత్రా మెట్ట పంటలు సాగు చేసే భూములనే తీసుకుంటారు. పత్తి, మిరప, కూరగాయలు అధికంగా సాగు చేసే కూసుమంచి మండలంలో ఏదో ఒక గ్రామాన్ని తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఏది అనువైన గ్రామమో పరిశీలించాలని ఆ జిల్లా అధికారులను వ్యవసాయ శాఖ ఆదేశించినట్లు సమాచారం. ఇదో వినూత్న ప్రక్రియ తక్కువ నీరున్న చోట మెట్ట పంటలను సాగు చేసేందుకు సూక్ష్మసేద్యాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రక్రియ నడుస్తోంది. బోరు బావి లేదా ఇతరత్రా వనరుల నుంచి సూక్ష్మసేద్యం పరికరాల ద్వారా ప్రతి మొక్కకు నీరు అందించేలా ఏర్పాటు చేస్తారు. ఈ పద్ధతిలో నీరు వృథా కాకుండా ఉంటుంది. గ్రీన్హౌస్లలో ప్రతి మొక్కకు నిర్ణీత స్థాయిలో నీరు పంపేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అంతకుమించిన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రైతు బోరు బావి నుంచి కాకుండా ఎత్తిపోతల పథకం నుంచే వేలాది ఎకరాలకు ఒకేసారి సూక్ష్మసేద్యం ద్వారా నీటిని పంపించనున్నారు. ఎత్తిపోతల ప్రాజెక్టుకు చెందిన భారీ పైపులకు సూక్ష్మసేద్యం పరికరాలను బిగించి వేలాది ఎకరాల్లోని మొక్కలను ఒకేసారి నీరందిస్తారు. ఇలా చేయడం వల్ల ఎత్తిపోతల నుంచి కాలువలకు, అటు నుంచి పొలాలకు అందించేటప్పుడు తలెత్తే వృథాను అరికట్టవచ్చు. పైగా సూక్ష్మసేద్యం నిర్వహణ భారం రైతులపై పడదు. రాష్ట్రంలో దీన్ని అమలుచేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుం దని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సూక్ష్మసేద్యానికి ప్రాధాన్యం రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మసేద్యానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రంలో నీటి వనరులు తక్కువగా ఉండటం, మెట్ట పంటల సాగు అధికంగా ఉండటంతో సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహిస్తోంది. అందుకోసం నాబార్డ్ నుంచి ఈ ఏడాది ఏకంగా రూ.వెయ్యి కోట్ల రుణాన్ని తీసుకుంది. సూక్ష్మసేద్యం పరికరాలు ఏర్పాటు చేసుకునే రైతులకు మరింత సబ్సిడీ ఇస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగానే సూక్ష్మసేద్యం పరికరాలు ఏర్పాటు చేస్తోంది. బీసీలకు 90 శాతం సబ్సిడీ, ఇతరులకు 80 శాతం సబ్సిడీతో అందజేస్తోంది. ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో సూక్ష్మసేద్యం అందుబాటులోకి రాగా.. ఎత్తిపోతల పథకాలతో అనుసంధానం చేస్తే సామూహిక సూక్ష్మసేద్యం అందుబాటులోకి వస్తుంది. ఇక మున్ముందు కాలువల ద్వారా కాకుండా సూక్ష్మసేద్యం ద్వారానే పంటలకు నీరందించే ప్రక్రియ మొదలుకానుంది. ఎత్తిపోతలకు సూక్ష్మసేద్యం అనుసంధాన కార్యక్రమానికి పాలేరు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిన విషయం వాస్తవమేనని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. -
రైతుల బట్టలు విప్పి దారుణంగా హింసిస్తారా?
సాక్షి, హైదరాబాద్ : రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి, మాజీమంత్రి పార్థసారధి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల వద్ద నుంచి వేల ఎకరాలు భూములు తీసుకుని ఇంతవరకూ ఎలాంటి నిర్మాణాలు చేయలేదని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారధి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజధాని నిర్మాణానికి భూమి ఇవ్వడానికి నిరాకరించిన రైతుపై టీడీపీ నేతలు, అధికారులు, పోలీసులు దాడి చేయడం ఎంతవరకు సమంజమన్న ఆయన ... కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత ప్రజలతో పాటు ప్రభుత్వంపై కూడా ఉందనే సంగతి మీకు తెలియదా చంద్రబాబూ అని ప్రశ్నించారు. రైతు గద్దె మీరాప్రసాద్ అనే వ్యక్తికి సంబంధించిన భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చినా అధికారులు దాన్ని ఉల్లంఘించారన్నారు. నిర్మాణాలను అడ్డుకోవడానికి వెళ్లిన రైతు బట్టలు ఊడదీసి దాడి చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఏపీలో ప్రస్తుతం రాక్షస పాలన కళ్లకు కట్టినట్లుగా ఉందన్నారు. ప్రజాస్వామ్య పాలన అయితే ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలన్నారు. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు సేకరించిన 33 వేల ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. వాటిల్లో 2,3 వందల్లో మాత్రమే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ కట్టారన్నారు. మిగిలిన భూముల్లో టీడీపీ ఎమ్మెల్యే లారీల్లో తన గేదెలను తీసుకువచ్చి మేపుకున్న దుస్థితి నెలకొందన్నారు. చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు మంత్రులు అండతో ప్రజలపై హింసకు దిగుతున్నారని పార్థసారధి మండిపడ్డారు. తమ భూమి ఇవ్వనని స్పష్టంగా చెప్పిన రైతుపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. అంటే రాష్ట్రంలో ఎలాంటి పాలన రాజ్యమేలుతుందో అర్థం చేసుకోవాలన్నారు. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన పోలీసులు, నిర్మాణాలు చేపట్టిన అధికారులు, వారి వెనుక ఉన్నవారిపై ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబు దోపిడీ యజ్ఞానికి శ్రీకారం చుట్టారు
-
‘చంద్రబాబుకు పోలవరం బంగారు బాతు’
సాక్షి, హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో తీవ్ర అవినీతి జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారి ప్రతినిధి పార్థసారధి ధ్వజమెత్తారు. టెండర్ల పేరుతో ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో దోచుకునేందుకు చంద్రబాబు దోపిడీ యజ్ఞానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. చంద్రబాబుకు పోలవరం బంగారు బాతుగా మారిందని పార్థసారధి వ్యాఖ్యానించారు. అంచనాలను విపరీతంగా పెంచి అవినీతికి పాల్పడుతున్నారన్నారు. కేంద్రం కూడా ఇదే విషయాన్ని చెబుతోందన్నారు. ఏడేళ్ల క్రితం రూ.10 వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదనలు రూపొందిస్తే..దాన్ని ఇప్పుడు రూ.58 వేల కోట్లకు అంచనాలు పెంచి చంద్రబాబు దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టులో తీవ్ర అవినీతి జరుగుతుందని, జరగని పనిని జరిగినట్లు, ఇష్టారాజ్యంగా అంచనాలు పెంచి, అదనపు చెల్లింపులు కాంట్రాక్టర్లకు చెల్లించి ఈ ప్రాజెక్టును పెద్ద ప్రశ్నార్థం చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో అవసరమని, అలాంటి ప్రాజెక్టు మనుగడను చంద్రబాబు ప్రశ్నార్థం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య వ్యక్తి పోలవరంలో జరుగుతున్న దోపిడీపై నీతి అయోగ్ చైర్మన్‌కు లేఖ రాశారంటే చంద్రబాబు దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందన్నారు. దోచుకోవడానికి ఒక ఆయుధంగా పోలవరాన్ని మలుచుకొని ఇష్టారాజ్యంగా అంచనాలు పెంచారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును చంద్రబాబు తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా చంద్రబాబు ప్రధాని మోదీకి ఓ లేఖ ఇచ్చారని, అందులో అందరూ నిర్ఘాంతపోయేలా అంచనాలు పెంచారన్నారు. ఉద్దేశపూర్వకంగా పోలవరాన్ని వెనక్కి నెట్టి పురుషోత్తం పట్టణం, పట్టిసీమ తీసుకొచ్చి తన దోపిడీకి కొత్త అర్థాలు చెప్పారని విమర్శించారు. రైతాంగం చంద్రబాబు దోపిడీ గురించి అర్థం చేసుకోవాలన్నారు. మొదట వైఎస్ఆర్ ధన యజ్ఞం చేశారని నాడు ప్రచారం చేశారని, ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో అంచనాలు పెంచిన చంద్రబాబుది ధన యజ్ఞం చేయడం వాస్తవం కాదా అని నిలదీశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక అంశాలపై ఆరోపణలు చేస్తే..వీటన్నింటిపైన వెనువెంటనే వైఎస్ రాజశేఖరరెడ్డి సీబీఐ విచారణ చేయించారని గుర్తు చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే పోలవరంలో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధమా అని చంద్రబాబుకు పార్థసారధి సవాల్ విసిరారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో చంద్రబాబు మాటల్లో నీతి అంతే ఉంటుందన్నారు. సమ్మిట్ల పేరు మీద, ప్రధానిని కలిసే పేరు మీద నాగపూర్, పూనా, ఢిల్లీకి ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు. -
బెజవాడ నడిబొడ్డున తేల్చుకుందాం...
సాక్షి, విజయవాడ : జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న పార్థసారధిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వైఎస్ఆర్ సీపీ నేత జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. ఆయన మంగళవారం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసులను అడ్డం పెట్టుకుని జన్మభూమి సభను నడిపిస్తున్నారని అన్నారు. తమ పార్టీ నేత పార్థసారధితో పాటు, కోలవెన్ను గ్రామ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్‌ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ సొమ్ముతో నిర్వహిస్తున్న జన్మభూమి...టీడీపీ కార్యక్రమంలా తయారైందని జోగి రమేష్ విమర్శించారు. జన్మభూమిలో ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలు, ప్రజాసంఘాలు జన్మభూమికి రాకూడదా? ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాకూడదా అంటూ... ఏం నేరం చేశారని పార్థసారధిని అరెస్ట్ చేశారని ప్రశ్నలు సంధించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి గడపకు రేషన్ కార్డులు ఇచ్చారన్నారు. విపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఉండేదని అన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ దుకాణాల్లో తొమ్మిది రకాల సరుకులు ఇచ్చేవారని, చంద్రబాబు పాలనలో బియ్యం తప్ప ఏమీ రావడం లేదని ఎద్దేవా చేశారు. రైతు రుణాలను మాఫీ చేశామని చంద్రబాబు సిగ్గులేకుండా చెబుతున్నారని, రుణమాఫీతో పాటు డ్వాక్రా గ్రూపులను నిర్వీర్యం చేసిన ఘనత ఆయనదేనని జోగి రమేష్ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే విజయవాడ నడిబొడ్డున చర్చకు రావాలని బహిరంగ సవాల్ విసిరారు. టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు నియోజకవర్గాల్లో ఏ మేరకు నెరవేర్చారో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. -
బోటు ప్రమాద ఘటనలో మంత్రే అసలు దోషి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిలో బోటు ప్రమాద ఘటనకు నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అసలు కారకుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి ధ్వజమెత్తారు. ఆయనకు నెలనెలా ముడుపులు అందుతున్నాయి కాబట్టే అనధికారిక పడవలు నడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. బోటు ప్రమాదం జరిగిన ప్రాంతం ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని, కూత వేటు దూరంలో ముఖ్యమంత్రి నివాసం ఉందని, అక్కడే ఇరిగేషన్ శాఖ ప్రధాన కార్యాలయం ఉన్నా బోటు ప్రమాదంపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. బోటు ఓనర్‌ను పట్టుకున్నామని, టూరిజమ్ జీఎంను సస్పెండ్ చేశామని చెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ధ్వజమెత్తారు. ఘటనకు కేవలం బోటు డ్రైవరే కారణమని చెప్పడం సరికాదని, ఇరిగేషన్ శాఖ మంత్రినే అసలు బాధ్యుడిని చేయాలని డిమాండ్ చేశారు. నెల నెలా ముడుపులు ముడుతున్నాయి కాబట్టి అనధికార బోట్లు తిరుగుతున్నా కళ్లప్పగించి చూస్తున్నారని ఆరోపించారు. బోటు ఘటనపై జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటుచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పార్థసార«థి డిమాండ్ చేశారు. -
‘గడ్కరీ చెప్పినా చంద్రబాబు వినడం లేదు’
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్‌ను మాయ ప్రాజెక్ట్‌లా తయారు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పార్థసారధి వ్యాఖ్యానించారు. కేంద్రానికి, రాష్ట్ర ప్రజలకు అర్థం కాకుండా పోలవరాన్ని మార్చారని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్థసారధి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘రూ.వేల కోట్ల భారం రాష్ట్ర ఖజానాపై పడుతున్నప్పటికీ కొత్త కాంట్రాక్టర్‌ను తీసుకు రావాలని ముఖ్యమంత్రి యత్నిస్తున్నారు. కేంద్రమంత్రి గడ్కరీ చెప్పినప్పటికీ చంద్రబాబు వినడం లేదు. పోలవరాన్ని ఒక ఆదాయ వనరుగా చంద్రబాబు మార్చుకున్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరం పూర్తి చేసి, రాష్ట్రానికి అప్పగించాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రం నుంచి పోలవరాన్ని చంద్రబాబు ఎందుకు లాక్కున్నారు?. పోలవరాన్ని కమీషన్ల ప్రాజెక్ట్‌గా చంద్రబాబు మార్చేశారు. రూ.16వేలకోట్ల ప్రాజెక్ట్‌ను రూ.50వేల కోట్ల ప్రాజెక్టుగా మార్చారు. కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ విషయంలో విచారణ చేసి ఏం జరుగుతుందో ప్రజలకు కేంద్రం చెప్పాలి. పోలవరం ఖర్చుపై కేంద్రం ఏ చెప్పిందో స్పష్టత ఇవ్వాలి. మీకు ముడుపులు చెల్లించే కాంట్రాక్టర్ కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే వైఎస్ఆర్ సీపీ చూస్తూ ఊరుకోదు.’ అని ఆయన హెచ్చరించారు. కేంద్రమంత్రి చెప్పినా చంద్రబాబు వినడం లేదు -
రేణుక ఏమీ ఆశించి టీడీపీలోకి వెళ్లారు?
సాక్షి, విజయవాడ : తమ పార్టీ గుర్తుపై గెలిచిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఏమి ఆశించి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి సూటిగా ప్రశ్నించారు. రాజకీయంగా అనుభవం లేకపోయినా ఎంపీ టికెట్ ఇచ్చి బుట్టా రేణుకను గెలిపించారన్నారు. ఆయన మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... బుట్టా రేణుకా పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో టీడీపీ సుమారు రూ.70 కోట్ల ప్యాకేజీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వాటికి ఆశపడే పార్టీ మారారా?. నైతిక విలువలను చంద్రబాబు నాయుడు తుంగలోకి తొక్కారు. తన అవినీతి, చేతగాని తనం నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఈ కొనుగోళ్లు మళ్లీ మొదలుపెట్టారు. ఎందుకంటే నవంబర్ 2 నుంచి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. ఆ పాదయాత్రలో టీడీపీ సర్కార్ చేస్తున్న అవినీతి, మోసాలు, అక్రమాలు, ప్రజలు ఏవిధంగా అన్యాయానికి గురవుతున్నారో ఇవన్నీ బట్టబయలు అవుతాయనే భయంతో ఈ ప్రక్రియను మళ్లీ మొదలుపెట్టారు. పశువులను కొంటున్నట్లు ఎమ్మెల్యేలు, ఎంపీలను కొంటున్నారు. సిగ్గులేకుండా కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు. వైఎస్ జగన్ మాత్రం నైతిక విలువలకు కట్టుబడి ఉన్నారు. రాజీనామా చేశాకే ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డిని వైఎస్ఆర్ సీపీలోకి చేర్చుకున్నారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలు, పాలనా వైఫల్యాలను పాదయాత్రలో వైఎస్ జగన్ ప్రజలకు వివరిస్తారు. మూడున్నరేళ్లలో చంద్రబాబు ఒక్క మంచి పని చేయలేదు. బలహీన వర్గాలకు చాలా హామీలిచ్చి మోసం చేశారు. బీసీల సంక్షేమంపై బహిరంగ చర్చకు మేం సిద్ధం. పీడీబ్ల్యూడీ గ్రౌండ్లో చర్చిద్దాం. తేదీ, సమయం మీరే నిర్ణయించండి.’ అని సవాల్ విసిరారు. బుట్టా రేణు పార్టీ ఫిరాయింపుపై ట్విస్ట్! ఎంపీ బుట్టా రేణుక ఫార్టీ ఫిరాయింపుపై ట్విస్ట్ నెలకొంది. మంగళవారం ఉదయం తన అనుచరులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఆమె.. టీడీపీలో చేరికపై అధికారికంగా స్పష్టమైన ప్రకటన ఏమీ చేయలేదు. అనర్హత వేటుకు భయపడే ఆమె ఈ ప్రకటన చేయనట్లు టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరోవైపు అమావాస్య కారణంగా బుట్టా రేణుక అధికారికంగా టీడీపీలో చేరలేదనే మరో వాదన కూడా వినిపిస్తోంది. కాగా, చంద్రబాబును కలిసిన అనంతరం బుట్టా రేణుక మాట్లాడుతూ అభివృద్ధి కోసమే తాను టీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గత మూడేళ్లుగా అభివృద్ధి పనుల కోసం చాలాసార్లు తాను ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినట్లు తెలిపారు. అప్పుడు కూడా అభివృద్ధి కోసమే ప్రభుత్వానికి మద్దతు తెలిపానన్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటుతోపాటు ఎన్నికలకు అయ్యే మొత్తం వ్యయాన్ని కూడా భరిస్తామని బుట్టా రేణుకకు హామీ ఇవ్వడంతో ఆమె పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారు. అలాగే తక్షణ ప్రయోజనంగా రూ.70 కోట్ల భారీ ప్యాకేజీతోపాటు పలు కాంట్రాక్టులు కూడా కట్టబెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అమెరికా పర్యటన తర్వాత కర్నూలు జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేసి బుట్టా రేణుక అధికారికంగా టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అదే రాజకీయ దిగజారుడుతనం...! తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి రాజకీయ దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తోన్న విషయం విదితమే. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలను, ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంది. సంతలో కొనుగోలు చేసినట్టు ఒక్కొక్కరికి ఒక్కో రేటు కట్టి మరీ కొనుగోలు చేసింది. అంతేకాకుండా రాజకీయ విలువలను తోసిరాజని రాజీనామా చేయని నలుగురికి మంత్రి పదవులను కట్టబెట్టింది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్ల నుండి రూ.100 కోట్ల వరకు ప్యాకేజీని కూడా ఇచ్చింది. ఈ విధంగా పార్టీ మారిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు పొందినవారు ఇప్పటికీ రాజీనామా చేయకపోవడం గమనార్హం. ఎన్నికల్లో గెలిచిన మూడు రోజులకే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిని పార్టీలో చేర్చుకుంది. ఇప్పటివరకు ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు. తాజాగా బుట్టా రేణుకను కూడా ప్రలోభాలకు గురి చేసి, పార్టీలో చేరేలా టీడీపీ పావులు కదిపింది. -
విజయవాడలో వైఎస్ఆర్ సీపీ నూతన కార్యాలయం
-
వైఎస్ఆర్ సీపీ నూతన కార్యాలయం
సాక్షి, విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధాన కార్యాలయం ఏర్పాటైంది. విజయవాడ బందర్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్, పార్టీ జిల్లా వ్యవహారాల ఇన్చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, కృష్ణా, గుంటూరు జిల్లాల అధ్యక్షులు కె.పార్థసారథి, మర్రి రాజశేఖర్, జోగి రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... ‘ఇవాళ మంచిరోజు కాబట్టి పూజా కార్యక్రమాలు, సర్వమత ప్రార్థనలు చేశాం. త్వరలో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఇక్కడ నుంచి తన కార్యకలాపాలు చేపడతారు. తాడేపల్లిలో శాశ్వత కార్యాలయం నిర్మాణంలో ఉంది. అది పూర్తయ్యేవరకూ ఇక్కడ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తాం’ అని తెలిపారు. కాగా రానున్న రోజుల్లో మంచి ముహూర్తాలు లేవన్న కారణంతో ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పనులన్నీ పూర్తయ్యాక పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. -
'చంద్రబాబు అండతోనే దాడులు'
విజయవాడ: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే అధికారులపై దాడులు జరుగుతున్నాయని వైఎస్ఆర్ సీపీ నేతలు పార్థసారథి, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నేతలు.. రవాణాశాఖ కమిషనర్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఐపీఎస్ అధికారికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఒక విధానం, ప్రతిపక్షానికి మరో విధానం కొనసాగుతుందని వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారథి అన్నారు. బస్సు ప్రమాదం సందర్భంగా అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షనేతపై కేసులు పెట్టిన అధికారులు.. ఎయిర్‌పోర్టులో జేసీ దివాకర్‌రెడ్డి వీరంగం సృష్టిస్తే కేసులు పెట్టలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇన్ని వందల అక్రమ బస్సులు ఎలా తిరుగుతున్నాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 'కమిషనర్ తాను నోరు తెరిస్తే చాలా అక్రమాలు బయటపడతాయని అన్నారు. ఆ నిజాలేంటో చెప్పాలి. ఏ ఒత్తిడిలతో వాస్తవాలను అణచివేస్తున్నారో చెప్పాలి' అని పార్థసారథి అన్నారు. తమను తాము కాపాడుకోవడానికి అధికారులు దండం పెట్టాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్న ఆయన.. వనజాక్షిపై దాడి చేసిన వారిని వెనుకోసుకొచ్చిన ముఖ్యమంత్రి రవాణా శాఖ కమిషనర్‌పై దాడి చేసినవారిని కూడా వెనుకేసుకొస్తారా లేక చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగ సంఘాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. పంచాయితీలు చేసే స్థితికి చంద్రబాబు దిగజారారన్నారు. ఎమ్మార్వో వనజాక్షి, టూరిజం సిబ్బందిపై దాడి ఘటనలో చర్యలు లేవని గుర్తు చేశారు. దాడికి పాల్పడిన కేశినేని నాని, బోండా ఉమపై చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. -
'చంద్రబాబు అండతోనే దాడులు'
-
రూ.20 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలి
వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కొలుసు పార్ధసారథి నందిగామ రూరల్ : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ పోరాడుతుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కొలుసు పార్ధసారథి స్పష్టం చేశారు. పెనుగంచిప్రోలు మండలం, ముండ్లపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై పది మంది మృత్యువాత పడగా, మిగిలిన వారు గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సారథి నందిగామ ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించడంతో పాటు క్షతగాత్రులను పరామర్శించేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్న నేపథ్యంలో అధికారులు హడావుడిగా తొమ్మిది మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసి తరలించే ప్రయత్నం చేశారు. ఈ చర్యను సారథితో పాటు పలువురు పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యం, ట్రావెల్స్ యాజమాన్యం స్వార్థం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. మృతులు, క్షతగాత్రులకు చంద్రన్న బీమా వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. చనిపోయిన వారితో పాటు గాయపడిన వారిలో పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఉన్నారని, వారికి చంద్రన్న బీమా పథకం ఎలా వర్తిస్తుందో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, గాయపడిన వారికి రూ.10 లక్షల వంతున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము డిమాండ్ చేసిన విధంగా నష్ట పరిహారం చెల్లించే వరకు మృతదేహాలను తరలించేందుకు అంగీకరించబోమని భీష్మించారు. దీంతో కలెక్టర్ బాబు.ఎ, ఎస్పీ జి.విజయకుమార్ నాయకులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూనే మరో పక్క పోలీసుల సాయంతో వారిని అక్కడ నుంచి పంపివేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి సామినేని ఉదయభాను, తిరువూరు శాసనసభ్యుడు రక్షణ నిధి, అధికార ప్రతినిధి జోగి రమేష్, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగ న్మోహనరావు, వెలంపల్లి శ్రీనివాసరావు, సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
ప్రభుత్వ దొంగబుద్ధిని అసెంబ్లీలో బయటపెడతాం
⇒ మాజీ మంత్రి పార్ధసారథి ⇒ మినప రైతులకు న్యాయం జరిగేలా పోరాటం ⇒ 28న పెనమలూరులో ధర్నా ⇒ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు ఉయ్యూరు : మినుము రైతును ఆదుకోవడంలో ప్రభుత్వ దొంగబుద్ధిని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో నిలదీస్తారని ఆ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కొలుసు పార్ధసారథి తెలిపారు. ఉయ్యూరులోని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులపాటి రామచంద్రరావు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మినుము పంట నష్టపోయి ఆర్థికంగా కుంగిపోయి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులను ప్రభుత్వం మరోసారి వెన్నుపోటు పొడిచిందన్నారు. ఫిబ్రవరి 15 నుంచే మినుము పంటను రైతులు పీకేస్తారని తెలిసి నెలాఖరుకు ఎన్యుమరేషన్ చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఉద్దేశపూర్వకంగా రైతులను మోసం చేసేందుకేనని స్పష్టం చేశారు. రైతులందరూ పంట పొలాలను దమ్ము చేసి దాళ్వా సాగు చేశారని, కొందరు పశువులు, గొర్రెల మేతకు వదిలేశారని చెప్పారు. పదిహేను రోజులు ముందుగానే వైఎస్సార్ సీపీ మినుము పంట నష్టంపై స్పష్టమైన వైఖరిని ప్రకటించిందన్నారు. అసలు ఎంత మంది రైతులు మినుము పంట సాగు చేశారో అనే లెక్క మీ దగ్గర ఉందా? లేదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మినుము రైతుకు న్యాయం జరిగేలా కృషి.. అసెంబ్లీలో మినుము రైతు అంశంపై చర్చకు పట్టుబట్టి న్యాయం జరిగేలా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తారని పార్ధసారథి తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు దమ్ము ధైర్యం ఉంటే సీఎంతో మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని సూచించారు. ఎన్యుమరేషన్ తీరును నిరసిస్తూ, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న పెనమలూరు నియోజకవర్గంలో ధర్నా చేస్తామని ప్రకటించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలతో చర్చించి జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తామన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగవీటి శ్రీనివాసప్రసాద్, పెనమలూరు, ఉయ్యూరు టౌన్ అధ్యక్షులు కిలారు శ్రీనివాసరావు, జంపాన కొండలరావు తదితరులు పాల్గొన్నారు. -
పార్థసారథికి అదనపు బాధ్యతలు
విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథికి ఆ పార్టీ అదనపు బాధ్యతలు అప్పగించింది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్థసారథిని పెనమలూరు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న పార్థసారథి అధ్యక్ష బాధ్యతలతోపాటు పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా పూర్తి స్థాయిలో పని చేస్తారు. ఆయన నేతృత్వంలోనే నియోజకవర్గంలోని పార్టీ కార్యక్రమాలన్ని జరుగుతాయని ఆ ప్రకటనలో వివరించింది.