
సాక్షి, విజయవాడ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధాన కార్యాలయం ఏర్పాటైంది. విజయవాడ బందర్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్, పార్టీ జిల్లా వ్యవహారాల ఇన్‌చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, కృష్ణా, గుంటూరు జిల్లాల అధ్యక్షులు కె.పార్థసారథి, మర్రి రాజశేఖర్, జోగి రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... ‘ఇవాళ మంచిరోజు కాబట్టి పూజా కార్యక్రమాలు, సర్వమత ప్రార్థనలు చేశాం. త్వరలో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఇక్కడ నుంచి తన కార్యకలాపాలు చేపడతారు. తాడేపల్లిలో శాశ్వత కార్యాలయం నిర్మాణంలో ఉంది. అది పూర్తయ్యేవరకూ ఇక్కడ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తాం’ అని తెలిపారు. కాగా రానున్న రోజుల్లో మంచి ముహూర్తాలు లేవన్న కారణంతో ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పనులన్నీ పూర్తయ్యాక పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment