
సాక్షి, పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. రెండు వేర్వేరుచోట్ల జరిగిన దాడుల్లో ఒకరికి తీవ్రగాయాలు కాగా, మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈడుపుగల్లుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త షేక్ బాజీపై పది మంది టీడీపీ కార్యకర్తలు దారి కాచి దాడి చేసిన ఘటనలో బాజీ తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మద్దూరు అమ్మవారి ఊరేగింపులో టీడీపీ కార్యకర్తలు చేసిన దాడుల్లో నలుగురు గాయాలపాలవ్వగా ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పయ్యావుల అనుచరుల దౌర్జన్యం
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మైలారంపల్లి గ్రామంలో మైనార్టీ దంపతులపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరుల దౌర్జన్యం చేసి, దాడికి పాల్పడ్డారు. టీడీపీ నేతలు ఇచ్చిన చీరలు తీసుకోలేదన్న అక్కసుతో అల్లా బకాష్ -ఇమాంబిలపై విచక్షణారహితంగా దాడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment