కోడ్ అమలుపై సిబ్బందికి సూచనలిస్తున్న అధికారి మిషాసింగ్
సాక్షి, కంకిపాడు: ఎన్నికల కోడ్ అమలుపై దృష్టి పెట్టాలని విజయవాడ సబ్‌కలెక్టరు, నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మిషా సింగ్ ఆదేశించారు. మంగళవారం ఆమె కంకిపాడులో పర్యటించారు. గోసాల సెంటరులో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న వాహనాల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం బస్టాండు సెంటరులో ప్రచారంలో ఉన్న వాహనాన్ని సిబ్బందితో తనిఖీ చేయించి అనుమతులు తీసుకున్నారో? లేరో? పరిశీలించారు. అనుమతులు లేని ఓ ప్రచార వాహనాన్ని మండల పరి షత్ కార్యాలయానికి తరలించారు.
తహసీల్దార్ మమ్మీ, స్క్వాడ్ ప్రతినిధి లక్‌పతి, ఇతర సిబ్బందితో సబ్‌కలెక్టరు మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. నిబంధనలు పాటించకుండా ప్రచారం సాగిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
లోగోలు తొలగించండి
ఈడుపుగల్లు(కంకిపాడు):విద్యాశాఖ ద్వారా పంపిణీ చేయనున్న సైకిళ్లపై ప్రభుత్వ లోగోలను తొలగించాలని విజయవాడ సబ్ కలెక్టరు మిషాసింగ్ ఆదేశించారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా సీఎం, మంత్రి ఉన్న ఫోటోలతో ఉన్న లోగోను సైకిళ్లపై అమర్చి విద్యార్థినులకు పంపిణీకి సన్నాహాలు చేయడంతో అధికా రులు నిలుపుదలచేయించిన విషయం తెలిసిందే.
దీంతో ఈడుపుగల్లు జెడ్‌పీహైస్కూల్‌లో అందుబాటులో ఉంచిన సైకిళ్లను మంగళవారం ఆమె పరిశీలించారు. విద్యాశాఖ ద్వారా పంపిణీ జరుగుతున్నందున ప్రభుత్వ లోగోలు తొల గించాలన్నారు. జిల్లా విద్యాశాఖ నుంచి పంపిణీ తేదీ తీసుకుని లబ్ధిదారులకు సైకిళ్లు అందించాలని, లోగోలను పోలీ సుస్టేషన్‌లో అప్పగించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment