
పెనమలూరులో బోడేకు నో టికెట్
బోడే అనుచరులు, కార్యకర్తలు మండిపాటు
చంద్రబాబు సీఎం కుర్చీలో ఎలా కూర్చుంటాడో చూస్తాం
సాక్షి, కృష్ణా జిల్లా: పెనమలూరులో బోడే ప్రసాద్‌కు టిక్కెట్ దక్కక పోవడంపై కార్యకర్తల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు తీరుపై బోడే అనుచరులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. 40 ఏళ్లుగా పార్టీలో ఎందుకున్నామా అనినిపిస్తోందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బోడే కాలికి బలపం కట్టుకుని పెనమలూరులో తిరిగారు. చంద్రబాబు,లోకేష్ కూడా బోడే మాదిరి తిరగలేదు. చంద్రబాబు జైల్లో ఉంటే మా ఇంట్లో మనిషిలాగా భావించాం. 53 రోజులు నిరాహారదీక్షలు చేశాం. నేటి నుంచి టీడీపీ,చంద్రబాబు ఓటమే లక్ష్యంగా పనిచేస్తాం. చంద్రబాబు సీఎం కుర్చీలో ఎలా కూర్చుంటాడో చూస్తాం. పెనమలూరుకు వచ్చే టీడీపీ అభ్యర్ధికి రేపటి నుంచి చుక్కలు చూపిస్తాం’’ కార్యకర్తలు హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఫైనల్‌గా ఫిక్స్.. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ