
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడలో నిరసన సెగ తగిలింది. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వర్గం చంద్రబాబు కాన్వాయ్ వైపు దూసుకొచ్చింది. బోడె ప్రసాద్‌కే పెనమలూరు టికెట్ ఇవ్వాలని ఆయన మద్దతుదారులు నినాదాలు చేశారు. ఇసుక కుంభకోణం కేసులో పూచీకత్తులు సమర్పించడానికి తడిగడప సీఐఈడీ కార్యాలయానికి చంద్రబాబు వచ్చిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరిక నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా బోడె ప్రసాద్ వర్గం ఆందోళన చేపట్టింది. నిరసనకారులను అడ్డుకోవడం పోలీసుల వల్ల కూడా కాలేకపోయింది. దీంతో పోలీసులు ఏర్పాట్లు చేసిన బారికేడ్లను సైతం తోసేసి ఫ్లకార్డులతో బాబు వైపు దూసుకొచ్చారు. కాగా ఇసుక పాలసీ కేసుతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం పాలసీ కేసులో బాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment