ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య
ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య
Published Wed, Sep 14 2016 11:44 PM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM
కంకిపాడు : ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రమైన కంకిపాడులో బుధవారం చోటుచేసుకుంది. ఓ మహిళ ఇంటి తలుపు కొట్టాడని నమోదైన కేసులో పోలీసులు కొట్టడం వల్లే తన భర్త చనిపోయాడంటూ మృతుడి భార్య ఆరోపిస్తుంది. వివరాల్లోకి వెళితే...దివిసీమకు చెందిన బొంగు చిన్నా (32) చిన్నతనంలోనే కంకిపాడుకు వచ్చాడు. స్థానికంగా ఉన్న ఇబ్రహీం అనే హోటలు యజమని అతడ్ని చేరదీసి, పెళ్లి చేశాడు. చిన్నా, స్వప్న దంపతులకు సాయిశ్రీ గాయత్రి (10), పవన్ (7) సంతానం. మూడు రోజులు క్రితం ఓ కేసు విషయమై చిన్నా పోలీసుస్టేçÙన్‌కు వెళ్లాడు. కేసు నమోదు కావడంతో బుధవారం కోర్టుకు వెళ్లి జరిమానా కూడా కట్టాడు. మధ్యాహ్నం 2 గంటల తరువాత భార్య స్వప్న ఇబ్రహీం హోటల్‌లో పనిచేసేందుకు వెళ్లింది. భోజనం కూడా చేయకుండా చిన్నా పడుకున్నాడని, వెళ్లి చూడమని ఇబ్రహీంతో చెప్పింది. దీంతో ఇబ్రహీం చిన్నా ఇంటికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని వేళ్లాడుతూ కన్పించాడు. దీంతో స్థానికులకు విషయం పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహం తరలింపులో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మృతికి కారణమైన మహిళను అరెస్టు చేయాలంటూ పలువురు స్థానిక మహిళలు పోలీసులను డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హనీష్ హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
నా భర్త చావుకు కారణం వాళ్లే...
తాను, తన భర్తతోపాటు కలిసి çహోటల్‌లో పనిచేసే ఓ మహిళతో చిన్నాకు వివాహేతర సంబంధం ఉందని తెలిసిందని, మూడు రోజుల క్రితం మద్యం తాగి ఆమె ఇంటికి వెళ్లి తలుపు కొడితే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిందని మృతుడి భార్య స్వప్న కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆ కేసులో పోలీసులు పిలిచి కొట్టారని, కోర్టులో ఫైన్ కట్టి వచ్చి ఉరివేసుకున్నాడని వాపోయింది. తన భర్త చావుకు వాళ్లే కారణమని, తనకు, తన పిల్లలకు న్యాయం జరిపించాలని విలపించింది.
Advertisement