
సీఎంఓ కారు బీభత్సం: ఒకరి మృతి
కంకిపాడు రూరల్: కృష్ణా జిల్లా కంకిపాడులో ఓ వాహనం బీభత్సం సృష్టించింది. బెజవాడ శ్రీనివాస్(46) అనే వ్యక్తి స్థానిక ఎస్‌బీఐ సెంటర్‌లో శుక్రవారం అర్థరాత్రి రోడ్డు పక్కన నిద్రిస్తుండగా, అతని మిత్రులు నిద్రలేపేందుకు వెళ్లారు. ఆ సమయంలొ ఏపీ ప్రభుత్వ( సీఎంఓ) స్టిక్కర్ కలిగి ఉన్న కారు వారి పైకి దూసుకు వచ్చింది. ఉదయ్‌కిరణ్‌ను ఢీకొట్టి శ్రీనివాస్‌పై వెళ్లి పావు కిలోమీటర్ దూరంలోని గన్నవరం రోడ్డులోకి వెళ్లింది. స్థానికులు కేకలు వేయటంతో అక్కడ స్పీడ్ బ్రేకర్ వద్ద ఆగి పోయింది.
కారు కింద ఇరుక్కుపోయిన శ్రీనివాస్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఉదయ్‌కిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కారులో సీసీఎస్ పోలీసులు ఉన్నట్లు చెబుతున్నారు. కారు యజమాని, డ్రైవర్ అయిన అన్నే శ్రీనివాస్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.