రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | road accident in kankipadu, woman dead | Sakshi

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Jul 15 2016 9:34 AM | Updated on Aug 30 2018 4:07 PM

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కొణతలపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

కంకిపాడు: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కొణతలపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వెనకాలే వస్తోన్న టాటా ఏస్ వాహనం బలంగా ఢీకొట్టింది. లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో టాటా ఏస్ వాహనంలో ప్రయాణిస్తోన్న శివ జ్యోతి(45) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శివ జ్యోతి స్వస్థలం గూడూరు మండలం గంటలమ్మపాలెం. పెద్ద కర్మ నిమిత్తం స్వగ్రామం నుంచి గన్నవరం మండలం సూరంపల్లి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement