సాక్షి ప్రత్యేక ప్రతినిధి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు తిరుగుబావుటా ఎగురవేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాబు ఎత్తులకు సీనియర్లు చెక్ పెడుతూ పైఎత్తులు వేశారని పరిశీలకులు అంటున్నారు. కృష్ణా నాయకులిచ్చిన ఝులక్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఇదివరకు ఇచ్చిన డైరెక్షన్‌కు పూర్తి భిన్నంగా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్లాష్ మెసేజ్ ఇవ్వాల్సి వచ్చింది. తాజా పరిణామాలు పారీ్టలోని ముఖ్య నాయకులు, శ్రేణులను గందరగోళానికి గురిచేస్తున్నాయి.
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రవాసాంధ్రులు, స్థితిమంతులకు ప్రాధాన్యమిచ్చే ప్రక్రియను తండ్రీకొడుకులైన చంద్రబాబు, లోకేష్ లు కొనసాగిస్తున్నారు. ఎన్నికలకు రూ.పదులు, వందల కోట్లను ఖర్చు చేయగలిగే వారికే టిక్కెట్లనే సంకేతాలను రాజకీయ మార్కెట్‌లోకి ఇదివరకే వదిలారు. దీంతో ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు, విభిన్న వర్గాల సంపన్నులు ముఖ్యంగా టీడీపీకి మద్దతిచ్చే సామాజికవర్గీయులు ముందువరుసలో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలోనూ వారే కనిపిస్తున్నారు. తాజాగా గుడివాడ నుంచి పోటీకి ప్రముఖంగా వినిపిస్తున్న పేరు విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్న వెనిగండ్ల రాము. గుంటూరు నుంచి ఉయ్యూరి శ్రీనివాస్‌ను ప్రోత్సహించే క్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుని ముగ్గురు పేద మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే.
కృష్ణాలో తాజా పరిణామమిది...
ఉమ్మడి కృష్ణాలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టవుతుండటంతో చంద్రబాబు జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నందిగామ, జగ్గయ్యపేటలో ముగియగా ఈ నెల 12– 14 తేదీల్లో మచిలీపట్నం నుంచి గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల మీదుగా నూజివీడు వరకు కార్యక్రమాన్ని ఖరారు చేశారు. మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చంద్రబాబు, లోకే‹Ùలను నిత్యం తూర్పారపడుతూ కొరకరాని కొయ్యగా మారిన నేపథ్యంలో గుడివాడలో ఎలాగైనా గట్టిపోటీ ఇవ్వాలనే ఆశతో బాబు ఉన్నారు. ఆ దృష్ట్యానే ఎనీ్టఆర్ స్వస్థలమైన నిమ్మకూరులో, గుడివాడలో బాబు బసచేసేలా కార్యక్రమం రూపొందింది.
సీనియర్లు కూడబలుక్కుని...
సీనియర్లయిన కొనకళ్ల, దేవినేని, కొల్లు తదితరులు కూడబలుక్కునే రాముకు సమాచారం ఇవ్వలేదనేది సమాచారం. ‘రావి వెంకటేశ్వరరావు ఇంఛార్జిగా ఉన్నారు. సొమ్ములతో ఊడిపడినంత మాత్రాన రాముకు మేం ప్రాధాన్యం ఇవ్వాలా? ఈరోజు రావి, రేపు మాలో ఎవరికైనా ఇలాంటి పరిస్థితే ఎదురుకాదన్న గ్యారంటీ ఏంటి? అధిష్ఠానానికి కూడా మా భావనలు తెలియాలిగా’ అని జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. పార్టీకోసం ఏళ్ల నుంచి కష్టపడిన వారిని పక్కకు తోసేస్తూ డబ్బులున్న వారికే సీటు ఇస్తామంటే చూస్తూ మౌనంగా ఉండాలా? అని మరో నేత ఘాటుగా స్పందించారు. ఇదే అంశాన్ని కొనకళ్ల వద్ద సాక్షి ప్రస్తావించగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సర్క్యులర్ ప్రకారమే తాము నడుచుకున్నామన్నారు. కార్యక్రమం కోసం విభిన్న పనులు ఉంటాయన్నారు.
అచ్చెన్న ఇలా... బాబు అలా...
నాయకులు కొందరు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ క్షేత్రస్థాయిలో పారీ్టకి అప్రతిష్ఠ తెస్తున్నారు. క్రమశిక్షణ లోపిస్తోంది. అలాంటి వారిపై తీవ్ర చర్యలు తప్పవు. తమకు సంబంధంలేని నియోజకవర్గాల్లో ఇతర నాయకులు పర్యటిస్తూ వర్గాలను ప్రోత్సహిస్తూ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారు. ఇకపై అలాంటివేవీ చేయడానికి వీల్లేదని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హోదాలో అచ్చెన్నాయుడు కొన్నాళ్ల కిందట ఓ ప్రకటనలో హెచ్చరించారు. గుడివాడ విషయంలో కృష్ణా నాయకులు అచ్చెన్న ప్రకటననే సాకుగా చూపి రావికి ప్రాధాన్యమిచ్చి, రామును దూరంపెట్టి అధిష్టానానికి ఝులక్ ఇచ్చారు.
ఇన్‌చార్జికే జిల్లా నేతల ప్రాధాన్యం
గుడివాడలో వెనిగండ్ల రామును పోటీకి దింపాలనే యోచనలో అధిష్ఠానం ఉండగా నియోజకవర్గ ఇన్‌చార్జిగా రావి వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. బాబు కార్యక్రమం ఏర్పాట్లలో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు బుధవారం గుడివాడలో పర్యటించారు. జిల్లా పరిధిలోని నియోజకవర్గ ఇంఛార్జులతో కొనకళ్ల గురువారం ఉదయం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమ తదితరులు పాల్గొన్నారు. రాముకు రెండు రోజులూ అధికారికంగా సమాచారం ఇవ్వలేదు. సమావేశానికి పిలవలేదు. బాబు, లోకేష్ ల ఆదేశాలమేరకు రాము కొన్ని నెలలుగా గుడివాడ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
బాబు ప్లాష్ మెసేజ్...
కృష్ణా నేతల తిరుగుబాటుకు ఉలిక్కిపడిన చంద్రబాబు పార్టీ నేతలకు ఫ్లాష్ మెసేజ్ పంపారు. ‘పార్టీ బలోపేతం కృషిచేసే పార్టీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఇంఛార్జుల అనుమతి అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. ఇది అచ్చెన్న హెచ్చరికకు పూర్తి విరుద్దంగా ఉండటం పరిశీలనాంశం.
Comments
Please login to add a commentAdd a comment