కృష్ణాజిల్లా : భారీ పేకాట శిబిరాన్ని నిర్వహిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు టీడీపీ నేతలు. జిల్లాలోని బాపులపాడు మండలం వేలేరులో పేకాట శిబిరంపై హనుమాన్ జంక్షన్ పోలీసులు మెరుపుదాడి చేశారు. బాపులపాడు టౌన్ టీడీపీ కార్యదర్శి గార్లపాటి రాజేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఒక భారీ పేకాట శిబరం ఏర్పాటు చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మెరుపుదాడి చేసి పలువుర్ని అరెస్ట్ చేశారు.
వీరిలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి ప్రధాన అనుచరుడైన బాపులపాడు టౌన్ టీడీపీ అధ్యక్షుడు అట్లూరి శ్రీనివాసరావు, గార్లపాటి రాజేశ్వరరావుతో పాటు మరో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 7 బైకులు, 9 మొబైల్స్, 112 కాయిన్స్, నగదు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment