pocker game
-
టీడీపీ నేతల ఆధ్వర్యంలో భారీ పేకాట శిబిరం
కృష్ణాజిల్లా : భారీ పేకాట శిబిరాన్ని నిర్వహిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు టీడీపీ నేతలు. జిల్లాలోని బాపులపాడు మండలం వేలేరులో పేకాట శిబిరంపై హనుమాన్ జంక్షన్ పోలీసులు మెరుపుదాడి చేశారు. బాపులపాడు టౌన్ టీడీపీ కార్యదర్శి గార్లపాటి రాజేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఒక భారీ పేకాట శిబరం ఏర్పాటు చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మెరుపుదాడి చేసి పలువుర్ని అరెస్ట్ చేశారు. వీరిలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి ప్రధాన అనుచరుడైన బాపులపాడు టౌన్ టీడీపీ అధ్యక్షుడు అట్లూరి శ్రీనివాసరావు, గార్లపాటి రాజేశ్వరరావుతో పాటు మరో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 7 బైకులు, 9 మొబైల్స్, 112 కాయిన్స్, నగదు స్వాధీనం చేసుకున్నారు. -
పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిన మహిళలు
-
పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిన మహిళలు
హైదరాబాద్: పేకాట స్థావరంపై దాడిచేసి ఏడుగురు మహిళలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని చైతన్యపురి గ్రీన్ హిల్స్ కాలనీలోని ఓ అపార్టుమెంట్ ఫ్లాటులో పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పేకాట ఆడుతున్న ఏడుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 26 వేల నగదుతో పాటు ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కాలనీలోని ఓ ఇంట్లో ఒక మహిళ మూడు ముక్కలాట క్లబ్ నిర్వహిస్తోందనే సమాచారంతో రంగంలోకి దిగిన చైతన్యపురి పోలీసులు పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీళ్లందరినీ చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. ఈ మహిళలంతా బడా వ్యాపారవేత్తల కుటుంబాలకు చెందినవారని తెలుస్తోంది. అసలు తెలంగాణ పరిధిలో ఎక్కడా పేకాట క్లబ్బులను అనుమతించేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెబుతుండగా, మరోవైపు మహిళలు ఇలా డబ్బులతో పేకాట ఆడటం విస్మయం కలిగించిందని ఎస్ఓటీ పోలీసులు అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటన ఈ ప్రాంతంలో జరిగింది. గతంలో రోడ్ నెం.2లో కొంతమంది మహిళలు పేకాట ఆడారని చెబుతున్నారు.