
సాక్షి, కృష్ణా జిల్లా: పామర్రు మండలం కొండాయపాలెం వద్ద కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గుడివాడ నుంచి పామర్రు వైపు వెళ్తున్న కారు.. కొండాయపాలెం వద్దకు రాగానే అదుపుతప్పి కాల్వలోకి దూసుకుపోయింది.
కాల్వలో నీరు ఎక్కువగా ఉండటంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఊపిరాడక మృతి చెందారు. సమాచారం అందుకున్న పామర్రు పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో కారును బయటకు తీశారు. మృతదేహాలను గుడివాడ ఆసుపత్రి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఎంతకు తెగించింది..! భర్త రూ.8 కోట్లు ఇవ్వలేదని, ప్రియుడితో కలిసి
Comments
Please login to add a commentAdd a comment