నన్ను, సీఎం జగన్‌ను ఎవ్వరూ ఓడించలేరు: కొడాలి నాని | Kodali Nani Serious Comments On Yellow Media Over Fake Propaganda On CM Jagan, Details Inside - Sakshi
Sakshi News home page

నన్ను, సీఎం జగన్‌ను ఎవ్వరూ ఓడించలేరు: కొడాలి నాని

Published Thu, Apr 4 2024 2:00 PM | Last Updated on Thu, Apr 4 2024 3:11 PM

kodali nani slams on yellow media over fake propaganda - Sakshi

సాక్షి, కృష్ణా: ప్రజలు తనను నిలదీశారంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని టీడీపీ నేతలకు మాజీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు. తనను నిలదీశారంటూ ఎల్లోమీడియాలో వస్తున్న వార్తలను పట్టించుకోనన్నారు. గుడివాడలో తనను, రాష్ట్రంలో సీఎం జగన్‌ను ఎవ్వరూ ఓడించలేరని తెలపారు. ఆ‍యన గురువారం మీడియాతో మాట్లాడారు.

‘ఎన్నికల ప్రచారంలో వందలాది చోట్లకు వెళుతున్నాం. మా పార్టీ కార్యకర్తలు, అభిమానులు నాకు శిరస్సుపై నుంచి క్షీరాభిషేకాలు చేస్తానంటే వద్దని వారించాను. నేను వద్దన్నా నాపై అభిమానంతో ఒకటి రెండు చోట్ల నా కాళ్లు కడిగారు. చంద్రబాబు, పవన్‌, లోకేష్ వాళ్ల డప్పులు వాళ్లే కొట్టుకొంటున్నారు. వాళ్ల దండలు వారే తెచ్చుకుంటున్నట్లు, వారి తమ్ముళ్లను వాళ్లే పోగేసుకునేలా, కార్యక్రమాలు నేను చేయడం లేదు. ఎల్లో మీడియాకు కళ్ళు మూసుకుపోయాయి. చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి ఎంతకైనా దిగజారతారు.

ఎన్నికల ప్రచారంలో చెంబుడు నీళ్లు కాళ్లపై పొయ్యడం పెద్ద విషయమా. నన్ను అల్లరి చేయడానికి ఏమీ లేక ఫాల్స్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ప్రజల ఇళ్ల సమస్యలు పరిష్కరించేలా.. 23 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 12వందల కోట్లతో ఇల్లు కట్టిస్తున్నాం. రూ. 320 కోట్లతో ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నాం. మంచినీటి అవసరాల కోసం రూ. 200 కోట్లు ఖర్చు చేశాం. రూ. 200 కోట్లతో రోడ్లు వేశాం.

ఎన్ని చేసినా ఎక్కడో ఒకచోట సమస్య అనేది ఉండటం సర్వసాధారణం. సమస్యలపై ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను అడుగుతారు. వారికి సమాధానం చెప్పుకుంటాం. మాకు మరో అవకాశం ఇస్తే పెండింగ్ సమస్యలు కూడా పరిష్కరిస్తామని ప్రజలకు చెబుతాం. ప్రజలు నేను ముఖాముఖిగా మాట్లాడుకుంటుంటే నన్నేదో నిలదీశారంటూ ఎల్లో మీడియా హడావుడి చేస్తుంది’అని కొడాలి నాని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement