సాక్షి, గుంటూరు: ఎక్కడైనా ప్రతిపక్షాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వమని పోరాటం చేస్తాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోనే విచిత్రంగా పేదల ఇళ్లకు అడ్డుపడ్డాయని, ఇంత దుర్మార్గులను ఎక్కడా చూడలేదని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఆర్డీఏ పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా వెంకటపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి రమేష్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను ఏకిపారేశారు.
‘‘రాజధానిలో పేదలు నివసించకూడదా?’’.. రాజకీయాల్లో చంద్రబాబు అంత దౌర్భాగ్యుడు లేడు. ఈ నాలుగేళ్లు సైలెంట్‌గా ఉండి.. ఎన్నికల సీజన్ స్టార్ట్ కాగానే రోడ్డెక్కాడు. ఇదెలా ఉందంటే.. చిత్తకార్తెలో కుక్కల్లాగా రోడ్డెక్కినట్లుంది. ముసలి నక్క నారా చంద్రబాబు నాయుడు పేదలకు ఏనాడూ మంచి చేసింది లేదు. శవాలను సైతం పీక్కుని తినేరకం బాబు. అలాంటోడు మళ్లీ వస్తున్నాడు. అప్రమత్తంగా ఉండాలి అని ఏపీ ప్రజలకు మంత్రి జోగి రమేష్ సూచించారు.
ఇంకోడున్నాడు పవన్ కల్యాణ్.. పిచ్చి కుక్కలాగా అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నాడని జోగి రమేష్ మండిపడ్డారు. భార్యలతో పాటు ఎన్ని పార్టీలు మారుస్తావ్ రా నాయనా? అంటూ పవన్‌ను ప్రశ్నించారాయన. మార్చడం.. తార్చడం పవన్‌కు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో విగ్గురాజు ఒకడున్నాడు. వాడితో కలిసి.. ఇలా పార్టీలు మార్చడం, ఎన్నికల్లో పోటీ చేయించడం లాంటి కంపెనీ ఒకటి పెట్టుకో అంటూ పవన్‌కు సలహా ఇచ్చారు.
ఒకడున్నాడు.. చంద్రబాబు గాలికి వదిలేస్తే నడుచుకుంటూ ఊళ్లన్నీ తిరుగుతున్నాడు. ఆ ఊర పందికి సింహంలాంటి సీఎం జగన్‌తో పోటీయా?.. అంటూ నారా లోకేష్‌పైనా జోగి రమేష్ విరుచుకుపడ్డారు.
సీఎం జగన్ పేదలకు చేయూత ఇస్తున్నాడు. అన్నం పెడుతున్నాడు. అమ్మ ఒడి ఇస్తున్నాడు. కోటి మంది అక్కచెల్లెమ్మలకు ఆసరా ఇస్తున్నాడు. అద్దె ఇళ్లలో ఉంటున్నవాళ్లకు శాశ్వత గూడులు కల్పిస్తున్నాడు. ఎంత మంది వచ్చినా సీఎం జగన్‌ను టచ్ కూడా చేయలేరంటూ జోగి రమేశ్ ఆవేశపూరితంగా ప్రసంగించారు. పేద వాళ్ల పక్షాన నిలిచిన జగనన్నకు రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ వెంట నిలవాలని విజ్ఞప్తి చేశారు మంత్రి జోగి రమేష్.
ఇదీ చదవండి: ఇంటిపై రామోజీ ఏడుపు ఇంతింత కాదయ్యా!
Comments
Please login to add a commentAdd a comment