సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ కింద ఇళ్ల నిర్మాణం వేగాన్ని పెంచాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే 7.43 లక్షల ఇళ్లను అక్కచెల్లెమ్మలకు అందించామన్న అధికారులు.. ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల ఇళ్లు పూర్తిచేసే దిశగా ముందుకు సాగుతున్నామని అధికారులు తెలిపారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని వెల్లడించారు.
సీఎం జగన్ మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా రాజీ పడవద్దని స్పష్టం చేశారు. కరెంటు, తాగు నీరు ఉన్నాయా? లేవా? అన్న వాటిపై ఆడిట్ చేయించాలన్నారు. ఇప్పటివరకూ తీసుకున్న రుణాలపై వడ్డీ డబ్బు విడుదలకు సన్నద్ధం కావాలన్న సీఎం.. టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన అసోసియేషన్లు సమర్థవంతంగా పనిచేసేలా వారికి తగిన అవగాహన కల్పించాలని, ప్రభుత్వం ఇచ్చిన లక్షల విలువైన ఆస్తిని ఎలా నిర్వహించుకోవాలన్న దానిపై వారికి అవగాహన ఇవ్వాలి’’ అని సీఎం సూచించారు.
ఈ సమీక్షా సమావేశానికి గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ దవులూరి దొరబాబు, సీఎస్ జవహర్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సెక్రటరీ దీవాన్ మైదీన్, టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వీ జీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
చదవండి: చంద్రబాబు మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది వైద్యులా? రాజకీయ నేతలా?: సజ్జల
Comments
Please login to add a commentAdd a comment